Begin typing your search above and press return to search.

ఒక హీరోతో డేటింగ్‌ - మరో హీరోతో పెళ్లి..!

By:  Tupaki Desk   |   13 Nov 2018 4:24 AM GMT
ఒక హీరోతో డేటింగ్‌ - మరో హీరోతో పెళ్లి..!
X
బాలీవుడ్‌ స్టార్‌ హీరో సైఫ్‌ అలీఖాన్‌ కూతురు సారా అలీఖాన్‌ హీరోయిన్‌ గా ఎంట్రీ ఇచ్చిన విషయం తెల్సిందే. హీరోయిన్‌ గా పరిచయం అయిన ఈమె కు తప్పకుండా మంచి కెరీర్‌ ఉంటుందని అంతా నమ్మకంగా చెబుతున్నారు. తాజాగా ఈమె తన తండ్రి సైఫ్‌ అలీ ఖాన్‌ తో కలిసి ప్రముఖ టాక్‌ షో కాఫీ విత్‌ కరణ్‌ లో పాల్గొంది. ఆ ఎపిసోడ్‌ ఇంకా ప్రసారం కాలేదు - కాని ఆ షోకు సంబంధించిన ట్రైలర్‌ ను విడుదల చేయడంతో పలు ఆసక్తికర విషయాలు అప్పుడే సోషల్‌ మీడియాలో హల్‌ చల్‌ చేస్తున్నాయి. సైఫ్‌ అలీ ఖాన్‌ తో పాటు సారా అలీ ఖాన్‌ ను తన ప్రశ్నలతో కరణ్‌ జోహార్‌ కడిగేసినట్లుగా అనిపిస్తుంది.

సారా అలీ ఖాన్‌ ను పెళ్లి చేసుకోవాలంటే ఏ హీరో - డేటింగ్‌ కు అయితే ఏ హీరో కావాలి అంటూ కరణ్‌ జోహార్‌ ప్రశ్నించాడు. సహజంగా అయితే రెంటికి ఒకే హీరో కావాలని హీరోయిన్స్‌ చెబుతారు. కాని సారా అలీ ఖాన్‌ మాత్రం అనూహ్యంగా తనకు రణ్‌ బీర్‌ కపూర్‌ ను పెళ్లి చేసుకోవాలని ఉందని చెప్పింది. ప్రస్తుతం రణ్‌ బీర్‌ కపూర్‌ బాలీవుడ్‌ లో స్టార్‌ గా వెలుగు వెలగడంతో పాటు - మోస్ట్‌ రొమాంటిక్‌ హీరోగా కూడా పేరు తెచ్చుకుంటున్నాడు. అందుకే ఆయన్ను పెళ్లి చేసుకోవాలని కోరుకుంటున్నట్లుగా సారా అలీ ఖాన్‌ చెప్పుకొచ్చింది.

ఇక డేటింగ్‌ విషయానికి వస్తే కార్తిక్‌ ఆర్యన్‌ తో చేయాలని కోరికగా ఉందని చెప్పింది. డేటింగ్‌ ఒక హీరోతో - పెళ్లి మరో హీరోతో అంటూ సారా అలీఖాన్‌ చెప్పడంతో సోషల్‌ మీడియాలో ఆమె వ్యాఖ్యలు వైరల్‌ అవుతున్నాయి. సారా అలీఖాన్‌ ‘సింబా’ మరికొన్ని రోజుల్లో విడుదల కాబోతుంది. స్టార్‌ హీరో కూతురు అయినప్పటికి ఎలాంటి ఇబ్బంది లేకుండా స్కిన్‌ షోకు ఈమె గ్రీన్‌ సిగ్నల్‌ ఇచేస్తోంది.