Begin typing your search above and press return to search.

ఫోటోలు తీస్తుంటే త‌రిమి కొట్టింది!

By:  Tupaki Desk   |   21 Sep 2018 4:05 AM GMT
ఫోటోలు తీస్తుంటే త‌రిమి కొట్టింది!
X
అందంగా ఉన్నాం క‌దా అని వెంట‌ప‌డ‌తారా? ఫోటోలు తీస్తారా? తాట తీస్తాం.. త‌స్మాత్ జాగ్ర‌త్త‌!! ఇదీ ఆ స్టార్ కిడ్‌ వీరంగం. ఇది ఏ ఒక్క స్టార్ డాట‌ర్‌ నో అయితే స‌రే.. భామ‌లంద‌రి తీరు ఇదే. అనుమ‌తి లేకుండా సెల్ కెమెరా - డిజిట‌ల్ కెమెరాల్లో క్లిక్‌ మ‌నిపించేస్తాం అంటే ఊరుకోరు. వార్నింగులు ఇస్తారు. కెమెరాలు లాక్కుని విసిరేస్తారు. చేతిలో ఏం ఉంటే దాంతో కొడ‌తారు. లేదా బూతులు తిడ‌తారు. అన్నిటికీ సిద్ధ‌మైతేనే ఫోటోలు తీయాలి.

అయినా అనుమ‌తి లేకుండా ఫోటోలు తీసేస్తే ఎలా? చ‌క్క‌న‌మ్మ‌ల‌కు కోపం రాదూ? ఎంత ప్రొఫెష‌న‌ల్ ఫోటోగ్రాఫ‌ర్ అయినా.. క్ష‌మాప‌ణ‌లుండ‌వ్‌! ఇదిగో ఇక్క‌డ సైఫ్‌ఖాన్ డాట‌ర్ సారా అలీఖాన్ అలానే ఓ గ‌డుగ్గాయ్‌ ని చీవాట్లు పెట్టేస్తోంది. పొట్టినిక్క‌రులో జిమ్ముకొస్తే అలా ఆరాంగా ఫ్లాష్‌ లు లాగేస్తావా బ‌చ్చా! అంటూ తిడుతోంది. పాపం ఆ పోర‌డు మాత్రం మ్యాడ‌మ్ ఇక తియ్య‌నులే ప్లీజ్‌! అనేస్తున్నాడు.

సైఫ్‌ అలీ ఖాన్ మొద‌టి భార్య అమృత సింగ్ కుమార్తె సారా అలీఖాన్. ప్ర‌స్తుతం ఈ అమ్మ‌డు ర‌ణ‌వీర్ సింగ్ స‌ర‌స‌న సింబా చిత్రంలో న‌టిస్తోంది. తొలి సినిమా అయినా రిలీజ్ కాక‌ముందే కుర్రాళ్లు వెర్రెత్తిపోతున్నారు. పిచ్చి ప‌ట్టి సారా ఎక్క‌డ ఉంటే అక్క‌డికి వ‌చ్చి వాలిపోతున్నారు. ప‌బ్బు - క్ల‌బ్బు - జిమ్ము కాదేదీ బీటింగ్‌ క‌న‌ర్హం అన్న చందంగా చెల‌రేగిపోతున్నారు. ఇక ఫోటోగ్రాఫ‌ర్ల‌కు అవ‌కాశం దొరికితే చాలు ఆ అందాన్ని కెమెరా కంట్లో బంధించేస్తున్నారు. అయితే వేళా పాళా లేకుండా అలా మీద‌ప‌డితే క‌స్సుబుస్స‌న‌కుండా ఉంటుందా? డిసెంబ‌ర్ 28న సింబా రిలీజ‌వుతోంది. తొలి సినిమా హిట్ట‌యితే ఇంకెలా ఉంటుందో అమ్మ‌డు?