Begin typing your search above and press return to search.

రాజకీయాల్లోకి వస్తానంటున్న స్టార్ కిడ్

By:  Tupaki Desk   |   14 April 2019 11:56 AM GMT
రాజకీయాల్లోకి వస్తానంటున్న స్టార్ కిడ్
X
పోయినేడాది బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన స్టార్ కిడ్స్ లో సారా అలీ ఖాన్ ఒకరు. సైఫ్ అలీ ఖాన్ - అమృతా సింగ్ ల ముద్దుల కూతురిగా బాలీవుడ్ కు పరిచయం అయిన సారా నటించిన రెండు సినిమాలు హిట్ అయ్యాయి. డెబ్యూ సినిమా 'కేదార్ నాథ్' తో పాటుగా.. రెండో సినిమా 'సింబా' కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ గా నిలిచింది. దీంతో ఆడియన్స్ లో మంచి గుర్తింపు కూడా తెచ్చుకుంది. ఇదిలా ఉంటే రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో రాజకీయాల గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

సారా ఆలీ ఖాన్ హిస్టరీ.. పొలిటికల్ సైన్స్ లో డిగ్రీ చదివిందట. అందుకే తనకు ఫ్యూచర్ లో రాజకీయాల్లోకి అడుగుపెట్టాలని ఉందని తెలిపింది. కానీ ప్రస్తుతానికి మాత్రం తన దృష్టి పూర్తిగా సినిమాలపైనే ఉందని తేల్చేసింది. సహజంగా ఎవరైనా సినిమా స్టార్లు లేదా స్టార్ కిడ్స్ ను రాజకీయాల గురించి అడిగితే.. తమకు అస్సలు రాజకీయాలు తెలియదని లౌక్యంగా జవాబిస్తారు. కానీ వాళ్ళే ఫైనల్ గా మూడు నాలుగుపార్టీలు మారి అసలు సిసలు రాజకీయాలకు కేరాఫ్ అడ్రెస్ గా నిలుస్తారు. కానీ సారా మాత్రం అలాంటిదేమీ లేకుండా డైరెక్ట్ గా నే తన కోరిక వెల్లడించింది. సినిమా కెరీర్ ముగిసిన తర్వాత సారా అలీ ఖాన్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడం ఖాయమే. పటౌడీ ఖాన్ దాన్ నుంచి వచ్చిన వారసురాలు కాబట్టి జనాల్లోమంచి సపోర్టే ఉంటుంది.

ఇక సారా ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే ఇంతియాజ్ ఆలి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఆజ్ కల్' సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. కార్తీక్ ఆర్యన్ ఈ సినిమాలో హీరో. ఈ సినిమా పదేళ్ళ క్రితం రిలీజ్ అయిన సైఫ్ అలీ ఖాన్ - దీపిక పదుకొనే ల హిట్ సినిమా 'లవ్ ఆజ్ కల్' కు సీక్వెల్.