Begin typing your search above and press return to search.

స్టార్ కిడ్ ఛాన్సు మిస్సయిపోయిందే

By:  Tupaki Desk   |   23 April 2017 5:47 AM GMT
స్టార్ కిడ్ ఛాన్సు మిస్సయిపోయిందే
X
ఇప్పుడు హింది లో ఒక సినిమా లో పాత్ర కోసం మొత్తం యువ తరం నటీమణులు అంతా పోటీ పడుతున్నారు. యాష్ రాజ్ ఫిల్మ్స్ లో ఆఫర్ అంటే ఆమాత్రం ఆర్భాటం ఉండాలి కదా. అమీర్ ఖాన్ నటించబోతున్న కొత్త చిత్రం తగ్స్ ఆఫ్‌ హిందోస్తాన్. ఈ సినిమా లో అమితాబ్ కూడా నటించబోతున్నారు. మ్యాటర్ ఏంటంటే.. సైఫ్ అలీ ఖాన్ మొదటి భార్య కూతురు సారా ఆలీ ఖాన్ ఇప్పుడు ఈ సినిమాతో తెరంగేట్రం చేయాలని కలలు కనేసింది. కాని అవి అడియాశలే అయ్యాయ్.

సారా అలీ ఖాన్ ఇప్పుడు బాలీవుడ్ మోస్ట్ ఫేమస్ స్టార్ కిడ్ గా చలామణి లో ఉంది. ఈమె ఏ సినిమాతో వస్తుందా అని సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. సారా ఫిల్మ్ దేబూట్ స్టార్ హీరో హృతిక్ రోశన్ తో కావచ్చు అని ఒక రూమర్ గతంలో వచ్చింది. అలాగే కరణ్ జోహర్ తీయబోతున్న స్టూడెంట్ ఆఫ్‌ ది ఇయర్ 2 లో టైగర్ ష్రాఫ్‌ తో డెబ్యూ చేయిబోతోంది అని కూడా రూమర్స్ వచ్చాయీ. ఐతే కరణ్ సినిమా ఆఫర్ దిశా పాటని కి వెళ్లింది అని తెలుస్తుంది. ఇదే విషయం ఆ పిల్లను అడిగితే నాకు ఈ విషయంకు ఎటువంటి సంబంధం లేదు అంటోంది. .

ఒక థగ్స్ ఆఫ్‌ హిందోస్తాన్ విషయానికి వస్తే.. ఆదిత్య చోప్రాకి సారా స్క్రీన్ టెస్ట్ అంతగా నచ్చలేదట. అందుకే అమీర్ ఖాన్ సినిమా లో ఛాన్స్ మిస్ అయింది అని బాలీవుడ్ వర్గాలు చెప్పుతున్నాయి. ఈ రోల్ కోసం దంగల్ సినిమాలో పెద్ద కూతురుగా నటించిన పిల్ల ఫాతిమా సనా షేక్ ను అనుకుంటున్నారు. ఇప్పటికే ఈ రోల్ కోసం ఫాతిమా చేసిన లుక్ టెస్ట్ ఫోటో ఒకటి బయట వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇదే రోల్ కోసం అలియా భట్ట్ - శ్రద్ధా కపూర్ - కృతి సనోన్ లను కూడా అనుకుంటున్నారట. చూద్దాం ఫైనల్ గా ఎవరు ఫైనల్ అవుతారో!!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/