బాలీవుడ్ హీరోయిన్.. ఛార్మినార్ దగ్గర షాపింగ్

Tue Jun 12 2018 16:05:07 GMT+0530 (IST)

సినిమాల్లోకి రాకముందే మంచి పాపులారిటీ సంపాదించిన బాలీవుడ్ భామ సారా అలీ ఖాన్. సైఫ్ అలీ ఖాన్ పెద్ద భార్య అమృతాసింగ్ తనయురాలైన ఈ అమ్మాయి తెరంగేట్రం చేయడానికంటే ముందే తన అందంతో అందరి దృష్టిని ఆకర్షించింది. సినిమాల్లోకి ఈమె అరంగేట్రం గురించి కొన్నేళ్లుగా ఆసక్తికర చర్చ నడుస్తోంది. చివరికి గత ఏడాదే ఆమె తొలి సినిమా ‘కేదార్ నాథ్’ పట్టాలెక్కింది. దానికి సంబంధించిన పోస్టర్లలో చాలా అందంగా కనిపించి ఆకర్షించింది సారా. ఈ అమ్మాయి సడెన్ గా హైదరాబాద్ లో ప్రత్యక్షమై అందరినీ ఆశ్చర్యపరిచింది. తన తల్లితో కలిసి ఆమె చార్మినార్ దగ్గర షాపింగ్ చేయడం విశేషం.మామూలు అమ్మాయిలా రోడ్డుమీదికి వచ్చి తల్లితో కలిసి రకరకాల వస్తువులు కొనుగోలు చేసింది సారా. ఇక్కడే ఆమె విందు కూడా చేసింది. రంజాన్ మాసంలో చార్మినార్ దగ్గర మామూలు హంగామా ఉండదు. అర్ధరాత్రి తర్వాత కూడా వేలాది మంది ఉత్సాహంగా షాపింగ్ చేస్తూ.. విందు చేస్తూ చాలా కోలాహలంగా ఉంటుంది వాతావరణం. ఈ చోటికి ముంబయి నుంచి ఒక హీరోయిన్ వచ్చి షాపింగ్ చేయడంతో మరింత సందడి నెలకొంది. సారాను చూసి ముందు ఎవరో మామూలు అమ్మాయే అనుకున్నారందరూ. కానీ ఆమె బాలీవుడ్ హీరోయిన్ అని.. సైఫ్ అలీ ఖాన్ కూతురని తర్వాత తెలిసి ఆశ్చర్యపోయారు. ‘కేదార్ నాథ్’ పూర్తి కాకముందే ‘టెంపర్’ హిందీ రీమేక్ ‘సింబా’లోనూ సారా కథానాయికగా అవకాశం దక్కించుకున్న సంగతి తెలిసిందే.