Begin typing your search above and press return to search.

వైరల్ పాప కాదు.. సారాకే ఓటు

By:  Tupaki Desk   |   20 March 2018 5:15 AM GMT
వైరల్ పాప కాదు.. సారాకే ఓటు
X
టాలీవుడ్ హిట్ మూవీ టెంపర్ ను హిందీలో శింబ పేరుతో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ అద్భుతంగా పోషించిన పాత్రను.. హిందీలో యంగ్ స్టార్ రణవీర్ సింగ్ తో చేయిస్తున్నారు. రోహిత్ శెట్టి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుందని.. ధర్మ ప్రొడక్షన్ బ్యానర్ పై కరణ్ జోహార్ నిర్మిస్తాడనే సంగతులు తెలిసినవే.

శింబ మూవీలో హీరోయిన్ గా ఇండియాస్ లేటెస్ట్ సెన్సేషన్ ప్రియా ప్రకాష్ వారియర్ ను తీసుకున్నారనే ప్రచారం గట్టిగానే జరిగింది. కన్ను కొట్టి దేశాన్నే పడేసిన ఈఅమ్మాయి.. అప్పుడే బాలీవుడ్ ఆఫర్ కూడా వచ్చేసిందని అన్నారు. కానీ ఇప్పుడివన్నీ రూమర్స్ అనే సంగతి తేలిపోయింది. శింబ చిత్ర హీరోయిన్ అంశం పై నిర్మాణ సంస్థ నుంచి అఫీషియల్ క్లారిటీ వచ్చేసింది. ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్ కూతురు సారా అలీ ఖాన్ ను హీరోయిన్ ను గా ఫైనల్ చేశారనే విషయాన్ని నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించేసింది.

'అన్ని స్పెక్యులేషన్స్ కు ఇక్కడితో ముగింపు పలుకుతున్నాం. శింబ మూవీలో లీడింగ్ లేడీగా రణవీర్ సింగ్ కి జోడీగా సారా అలీ ఖాన్ నటించబోతోంది. 2018 డిసెంబర్ 28న మూవీ రిలీజ్' అంటూ ధర్మ ప్రొడక్షన్స్ తన అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ లో అనౌన్స్ చేసింది. అలాగే స్టన్నింగ్ ఫ్రెష్ ఫేస్ ప్లస్ ఓ సూపర్ స్టార్ అన్ లిమిటెడ్ ఎనర్జీ ప్లస్ ఇద్దరు పెద్ద ఫిలింమేకర్స్ క్రాఫ్ట్.. మొత్తం కలిపి సినిమా అప్పుడే సూపర్ హిట్ అంటున్నారు కరణ్ జోహార్.