Begin typing your search above and press return to search.

ఫిలింఫేర్‌: జాన్వీకి మ‌రో స్టార్ కిడ్‌ ఝ‌ల‌క్!

By:  Tupaki Desk   |   24 March 2019 7:10 AM GMT
ఫిలింఫేర్‌: జాన్వీకి మ‌రో స్టార్ కిడ్‌ ఝ‌ల‌క్!
X
64వ ఫిలింఫేర్ అవార్డ్ వేడుక‌లు ముంబైలో హోరెత్తిన సంగ‌తి తెలిసిందే. ఈ వేడుక‌ల్లో ప‌ద్మావ‌త్ దీపిక ప‌దుకొనే, రాజీ ఆలియా భ‌ట్ హ‌వా సాగింది. రాజీ చిత్రంలో స్పై పాత్ర‌లో న‌టించిన ఆలియా భ‌ట్ కు ఉత్త‌మ క‌థానాయిక అవార్డు ద‌క్కింది. ఇక ప‌ద్మావ‌త్ చిత్రం ప‌లు కేట‌గిరీల్లో అవార్డులు అందుకుంది. ఇక ఫిలింఫేర్ ఆద్యంతం అంద‌గ‌త్తెల త‌ళుకుబెళుకులు మైమ‌రిపించాయి. ఈ వేడుక‌ల్లో ఆలియా, దీపిక‌ల‌తో పాటు కేదార్ నాథ్ చిత్రంతో డెబ్యూ గా ఎంట్రీ ఇచ్చిన సారా అలీఖాన్ మైమ‌రిపించింది. `కేదార్ నాథ్‌`లో ఈ అమ్మ‌డి న‌ట‌న‌కు ఉత్త‌మ డెబ్యూ నాయిక‌గా అవార్డు ద‌క్కింది. ఇక బియాండ్ ది క్లైడ్స్ చిత్రంలో న‌ట‌న‌కు గానూ స్టార్ హీరో షాహిద్ సోద‌రుడు ఇషాన్ ఖ‌త్త‌ర్ కి ఉత్త‌మ డెబ్యూ హీరోగా పుర‌స్కారం ద‌క్కింది.

ఫిలింఫేర్ ఉత్స‌వం అంటే బాలీవుడ్ స్టార్ల‌కు ఎంతో క్రేజు. అందుకే ఈ వేదిక రంగుల మ‌యం అయ్యింది. ఇటు న‌వ‌త‌రం నాయిక‌లు, అటు సీనియ‌ర్ స్టార్లు ఈ వేడుక‌ల‌కు ఎటెండ్ అయ్యారు. ఇండ‌స్ట్రీ అగ్ర ద‌ర్శ‌క‌నిర్మాత‌లు ఈ వేదిక‌పై మెరుపులు మెరిపించారు. ఈ పుర‌స్కారాల పంపిణీ అంతే స‌హేతుకంగా ఉంద‌ని, ఎంపిక‌లు బావున్నాయ‌ని ప్ర‌శంస‌లు ద‌క్కాయి. అయితే ధ‌డ‌క్ చిత్రంతో డెబ్యూ నాయిక‌గా రంగ ప్ర‌వేశం చేసిన జాన్వీకి ఈసారి ఫిలింఫేర్ ద‌క్క‌క‌పోవ‌డ‌మేంటో? అంటూ అభిమానులు మాట్లాడుకుంటున్నారు. జాన్వీ స్థానంలో ఆ ఛాయిస్ సారా కొట్టేసింది మ‌రి!

ఇక ఇదే వేదిక‌పై శృంగార తార స‌న్నీలియోన్, లేటెస్ట్ సెన్సేష‌న్ కియ‌రా అద్వాణీ, సీనియ‌ర్ బ్యూటీ క‌త్రిన కైఫ్‌, హైద‌రాబాదీ బ్యూటీ దియా మిర్జా, దంగ‌ల‌క షూం స‌నా షేక్, జాన్వీ క‌పూర్, వాణీ క‌పూర్, మ‌నీష్ మ‌ల్హోత్రా, బోనీక‌పూర్, ఖుషీ, కృతి స‌నోన్, ఆథియా శెట్టి, వంటి స్టార్లు పాల్గొన్నారు.