పిన్ని పార్టీలో చేసినట్లే డాడ్ పార్టీలో కూడా..

Wed Aug 16 2017 18:01:39 GMT+0530 (IST)

బాలీవుడ్లో తెరమీద తెరంగేట్రం చేయడానికి చాలామంది యంగ్ స్టర్స్ రెడీ అయిపోతున్నారు. వారిలో ముఖ్యంగా అమితాబ్ మనువరాలు నవ్య నందా.. పూజా బేడి కూతురు ఆలియా ఇబ్రహీం.. శ్రీదేవి పెద్ద కూతురు జాన్వి కపూర్.. షారూఖ్ కూతురు సుహానా ఖాన్.. ఇలా చాంతాడంత లిస్టు ఉంది. ఇందులో ఇప్పుడు సైఫ్ ఆలి ఖాన్ కూతురు సారా ఆలి ఖాన్ పేరు మాత్రం ప్రథమంగా వినిపిస్తుంది. ఈమె త్వరలోనే 'కేథారనాథ్' సినిమాతో తెరంగేట్రం చేయనుంది.

అసలు ఈ అమ్మాయి గురించి జనాలు మాట్లాడుకోవడం ఎప్పుడు మొదలెట్టారంటే.. గడిచిన సంవత్సరం అమ్మడు పిన్ని కరీనా కపూర్ బర్తడే పార్టీకి వచ్చింది. అక్కడకు ఒక లెహంగాలో వచ్చి తన నాభి అందాలను దారపోస్తూ రెచ్చిపోయింది. ఆ లుక్కును చూసిన జనాలు పిచ్చెత్తిపోయారు. ఫిలిం ఇండస్ర్టీ కూడా ఈ అందాలన్నీ ఎప్పుడెప్పుడు తెరపైన చూస్తాం అంటూ ఆరాటపడింది. అక్కడ కట్ చేస్తే.. గత రాత్రి డాడ్ సైఫ్ 47వ బర్త్ డే పార్టీకి వచ్చింది. అక్కడ కూడా తెల్లటి బట్టల్లో పిక్కలు కనిపించేలా సందడి చేస్తూ బాగా రచ్చ చేసింది. ఈ పార్టీలో కూడా తన గ్లామర్ తో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్.

ఇప్పుడున్న యంగ్ డాటర్లలో ఎవరికివారే ఇలా గ్లామర్ ను ఆరబోస్తూ నానా రచ్చ చేస్తున్నారు. శ్రీదేవి కూతురు ఈవెంట్లలో.. ఆలియా ఇబ్రహీంలో ట్విట్టర్లో.. నవ్వ నంద ఫోటోషూట్లతో పిచ్చెత్తిస్తున్నారంతే.