Begin typing your search above and press return to search.

తొలిప్రేమ బ్యూటీ భలే హాటులే

By:  Tupaki Desk   |   14 Feb 2018 12:15 PM GMT
తొలిప్రేమ బ్యూటీ భలే హాటులే
X
తొలిప్రేమ సినిమాతో ఫైనల్ గా మెగా హీరో వరుణ్ తేజ్ కూడా రెండవ హిట్ అందుకున్నాడు. ఆ సినిమాకు ప్రస్తుతం ఏ సినిమా పోటీని ఇవ్వడం లేదు. ఈ వారం కొన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నప్పటికీ అవి ఎంతవరకు పోటీని ఇస్తాయో చెప్పలేము. ఇక అసలు విషయానికి వస్తే తొలిప్రేమ సినిమాలో తళుక్కున మెరిసిన హాట్ బ్యూటీ ఎవరో ఆ సినిమా చూసిన వారికి బాగా గుర్తుండి ఉంటుంది.

సునోనా సునైనా అనే సాంగ్ లో కనిపించిన సప్నా పబ్బి పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగానే వినిపిస్తోంది. హిందీ సీరియల్స్ ద్వారా నటిగా పరిచయమైనా సప్నా బాలీవుడ్ లో కామోషియా అనే హారర్ సినిమా ద్వారా హీరోయిన్ గా వెండి తెరకు ఎంట్రీ ఇచ్చింది. అయితే ఆ సినిమా ద్వారా అమ్మడికి పెద్దగా అవకాశాలు రాలేవు గాని వచ్చిన చిన్న అవకాశాలనే చేసుకుంటూ వెళ్లింది. ఫైనల్ గా తొలి ప్రేమ సినిమాలో ఛాన్స్ రావడంతో ఘాటుగా కనిపించి అందరు మాట్లాడుకునేలా చేసింది.

ఇక అసలు విషయానికి వస్తే రీసెంట్ గా చిత్ర యూనిట్ నిర్వహించిన థాంక్యూ మీట్ కోసం ఈ బ్యూటీ ఇచ్చిన ఎంట్రీ అందరిని షాక్ కి గురి చేసింది. అందాలను ప్రదర్శించినట్లే చేసి మళ్లీ దాచేసిందే అనేలా టాక్ ను సొంత చేసుకుంది. అమ్మడు కూర్చున్నా నిలబడినా సెక్సీ అందాలు చాలా కొత్తగా కనిపిస్తున్నాయో అని ఆమె పోటోలను చూసిన నెటిజన్స్ కామెంట్స్ చేయడం మొదలు పెట్టారు. ప్రస్తుతం సప్నా బాలీవుడ్ లో రెండు సినిమాలతో బిజీగా ఉంది. అలాగే మాధవన్ చేస్తోన్న బ్రీత్ వెబ్ సిరీస్ లో కూడా నటిస్తోంది.