Begin typing your search above and press return to search.

సంతోష్‌ సెంటిమెంట్‌ ఎలా ఉండబోతోందో

By:  Tupaki Desk   |   27 Nov 2015 7:30 PM GMT
సంతోష్‌ సెంటిమెంట్‌ ఎలా ఉండబోతోందో
X
ప్రస్తుతం బ్రహ్మోత్సవం సెట్స్ పై మహా బిజీగా ఉన్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. శరవేగంగా ఈ మూవీ కోసం వర్క్ చేయడమే కాదు.. తన నెక్ట్స్ ప్రాజెక్ట్ పై కూడా దృష్టి పెట్టేశాడు. ఇప్పటికే మురుగుదాస్ తో తన వెంచర్ ని ఫైనల్ చేసిన మహేష్.. ఇప్పుడు మిగిలిన టెక్నికల్ టీంని కూడా లాక్ చేసేస్తున్నారు. సంతోష్ శివన్ ని సినిమాటోగ్రాఫర్ తీసుకున్నాడు డైరెక్టర్ మురుగదాద్. దీనికి మహేష్ నుంచి కూడా ఆమోదం లభించేసింది.

ఇప్పుడు మిగిలిన టీం విషయంలో కూడా దూకుడుగానే ఎంపిక జరుగుతోంది. ఈ సంతోష్ శివన్ కి కెమేరా మ్యాన్ గా చాలామంచి పేరు ఉంది. ఈయన కేవలం సినిమాటోగ్రాఫర్ మాత్రమే కాదు, డైరెక్టర్ - ప్రొడ్యూసర్ - యాక్టర్ కూడా. ఇప్పటివరకూ 45 మూవీస్ కి, 41 డాక్యుమెంటరీలకు తన సేవలు అందించాడు. కెమేరామ్యాన్ గా 5 నేషనల్ అవార్డులు అందుకున్న చరిత్ర ఉంది. 2014లో అయితే.. బెస్ట్ సినిమాటోగ్రఫీకి 11 అవార్డులు అందుకుని ఓ రికార్డ్ కూడా సృష్టించాడు. అదే ఏడాది ప్రఖ్యాత అవార్డ్ పద్మశ్రీ కూడా అందుకున్నాడు సంతోష్ శివన్. అయితే.. పేరు ప్రఖ్యాతులు బాగానే ఉన్నా.. గత కొంత కాలంగా ఈయన ట్రాక్ రికార్డ్ మాత్రం బాలేదు. తుపాకి తప్ప.. మిగిలినవాటిలో కనీసం యావరేజ్ మూవీస్ కూడా లేవు.

అసలే సెంటిమెంట్స్ విషయంలో పక్కాగా ఫాలో అయిపోయే టాలీవుడ్.. ఈవిషయంలో మాత్రం బెంగ పెట్టేసుకుంటోంది. కాకపోతే ప్రస్తుతం ప్రిన్స్ మహేష్ తో పాటు డైరెక్టర్ మురుగదాస్ కూడా మంచి ఫామ్ లో ఉండడం కలిసొచ్చే విషయం. తన రికార్డులు కంటిన్యూ చేయడంతో పాటు.. సంతోష్ శివన్ కి కూడా బ్రేక్ ఇచ్చే మూవీ అవుతుందని.. అభిమానులు ఆశలు పెట్టుకున్నారు.