28 ఏళ్ళ తర్వాత సూపర్ స్టార్ తో..!

Mon Feb 11 2019 15:50:12 GMT+0530 (IST)

సూపర్ స్టార్ రజనీకాంత్ లాస్ట్ సినిమా 'పేట' సక్రాంతి సీజన్లో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత ఎఆర్ మురుగదాస్ దర్శకత్వంలో సినిమా చేసేందుకు రజనీకాంత్ రెడీ అవుతున్నారు.   ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ జోరుగా సాగుతున్న ఈ సినిమాకు సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది.ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ అందిస్తున్నట్టుగా లెజెండరీ సినిమాటోగ్రాఫర్ సంతోష్ శివన్ తెలిపారు.  తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఆయన "మొత్తానికి దళపతి తర్వాత  రజనీ సర్ తో సినిమా..  పనిచేసేందుకు ఎగ్జైట్ అవుతున్నా" అంటూ ట్వీట్ చేసి తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నారు.   'దళపతి'  1991 లో విడుదలయింది.  28 ఏళ్ళ తర్వాత మరోసారి రజనీకాంత్ తో కలిసి పనిచేస్తుండడంతో సంతోష్ శివన్ ఎగ్జైట్ కావడంలో ఆశ్చర్యమేమీ లేదు. ఎంతైనా రజనీ సూపర్ స్టార్ కదా!

దీనికి మురుగాదాస్ నేనూ ఎగ్జైటెడ్ గా ఉన్నాను అన్నట్టుగా ఒక ఎమోజీతో రిప్లై ఇచ్చారు.  మురుగదాస్ దర్శకత్వంలో  తెరకెక్కిన 'తుపాకి'.. 'స్పైడర్' సినిమాలకు సంతోష్ శివన్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేశారు.  దాదాపు అరడజను సార్లు నేషనల్ అవార్డులు గెలుచుకున్న సంతోష్ శివన్ కు ఎంతో సినిమాటోగ్రాఫర్ గా భారీ ఫాలోయింగ్ ఉంది.  సంతోష్ శివన్ ఎంట్రీ తో ఈ ప్రాజెక్ట్ మరింత క్రేజీగా మారింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఇతర వివరాలు త్వరలో వెల్లడవుతాయి.