Begin typing your search above and press return to search.

ఒక్క ట్వీట్‌ తో కెరీర్‌ ప్రమాదంలో..!

By:  Tupaki Desk   |   19 Sep 2018 8:12 AM GMT
ఒక్క ట్వీట్‌ తో కెరీర్‌ ప్రమాదంలో..!
X
పలు సూపర్‌ హిట్‌ చిత్రాలకు సినిమాటోగ్రఫీని అందించి తమిళ ప్రేక్షకులకు మాత్రమే కాకుండా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు అయిన సినిమాటోగ్రాఫర్‌ సంతోష్‌ శివన్‌. ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్నాడు. ఈయన దేశంలోనే అత్యున్నత పురస్కాంర అయిన పద్మశ్రీని కూడా పొందిన విషయం తెల్సిందే. అంతర్జాతీయ టెక్నాలజీని వినియోగించి తాను వర్క్‌ చేసే సినిమాలకు బెస్ట్‌ ఔట్‌ పుట్‌ ఇచ్చే సంతోష్‌ శివన్‌ తాజాగా చేసిన ఒక ట్వీట్‌ ఆయన కెరీర్‌ నే ముంచేసే స్థితికి తీసుకు వచ్చింది.

ఈ సినిమాటో గ్రాఫర్‌ ట్విట్టర్‌ లో ఒక మెమెను పోస్ట్‌ చేయడం జరిగింది. అందులో సినిమాకు వర్క్‌ చేసిన టెక్నీషియన్స్‌కు పారితోషికం ఇచ్చే సమయంలో - హీరోయిన్స్‌ కు పారితోషికం ఇచ్చే సమయంలో నిర్మాతలు ఎలా ఉంటారో కుక్క ద్వారా చూపిస్తూ ఉంది. రెండు ఎక్స్‌ ప్రెషన్స్‌ ఇచ్చిన కుక్క ఫొటోలను పోస్ట్‌ చేసి, కోపంగా ఉన్న కుక్క బోమ్మపై ఇది టెక్నీషియన్స్‌ కు పారితోషికం ఇస్తున్న సమయంలో - నవ్వుతూ ఉన్న కుక్క ఫొటో పై ఇది హీరోయిన్స్‌ కు పారితోషికం ఇస్తున్న సమయంలో నిర్మాతల ఫీలింగ్‌ అంటూ ఉంది. ఆ మెమె వివాదానికి కారణం అవ్వడంతో వెంటనే దాన్ని తొలగించాడు. అప్పటికే నష్టం జరిగిపోయింది.

ఈ విషయాన్ని తమిళ నిర్మాతలు చాలా సీరియస్‌గా తీసుకున్నారు. ఒక ప్రముఖ టెక్నీషియన్‌ అయ్యి ఉండి, ఇలాంటి కామెంట్స్‌ చేయడంపై నిర్మాతలు ఆగ్రహంతో ఉన్నారు. ఈ విషయమై మండలిలో ఫిర్యాదు చేశారు. కఠిన చర్యలకు డిమాండ్‌ చేస్తున్న నేపథ్యంలో నేడు తమిళ నిర్మాతల మండలి భేటీ కాబోతుంది. ఈ భేటీలో సంతోష్‌ శివన్‌ పై చర్యలు తీసుకునే అవకాశం ఉందని సమాచారం అందుతుంది. కొందరు నిర్మాతలు తమిళ ఇండస్ట్రీ నుండి ఆయన్ను బ్యాన్‌ చేయాలంటూ ఉండగా, మరి కొందరు మాత్రం మొదటి తప్పుగా వార్నింగ్‌ ఇచ్చి వదిలేయాలని అంటున్నారు. నేడు నిర్మాతల మండలి తీసుకోబోతున్న నిర్ణయంపై సంతోష్‌ శివన్‌ కెరీర్‌ ఆధారపడి ఉంటుందని తమిళ మీడియా వర్గాల వారు అంటున్నారు.