Begin typing your search above and press return to search.

స్టార్ కమెడియన్ రొమాన్స్ అదిరింది

By:  Tupaki Desk   |   17 Nov 2017 11:30 PM GMT
స్టార్ కమెడియన్ రొమాన్స్ అదిరింది
X
ఈ రోజులో సినిమా హీరోలు ఒకే సారి రెండు సినిమాలని చేయడానికి అస్సలు ఇష్టపడటం లేదు. ఒకవేళ డేట్స్ అడ్జస్ట్ అయ్యి మంచి కథ దొరికితే తప్ప రెండవ సినిమాను చేయట్లేదు. కానీ కొందరు స్టార్ కమెడియన్స్ అలా కాదు. ఒకే సారి 10 సినిమాలను చేయగలరు. అంతే కాకుండా ఒక స్టార్ హీరో ఒక సినిమాకు అందుకునే రెమ్యునరేషన్ ని వారు ఒక నెలలో సంపాదించగలరు. అంత మంచి జాబ్ ని ఎవరు వదులికోవడానికి ఇష్టపడరు.

కానీ కొందరు కమెడియన్స్ రోజు చేసే పాత్రలే అనుకుంటారో ఏమో గాని. హీరోలవుదామని వెళ్లి కోలుకోలేని దెబ్బ తింటున్నారు. ఎదో రెండు మూడు సినిమాలు హిట్ అవుతున్నాయి కానీ ఆ తర్వాత మళ్లీ వెనక్కి రావాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. తెలుగులో సునీల్ పరిస్థితి ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే కోలీవుడ్ లో సంతానం కూడా టాప్ కమెడియన్. దాదాపు స్టార్ హీరోలందరి సినిమాల్లో నటించారు. హీరోల లెవెల్ లో అభిమానులను కూడా సంపాదించుకున్నాడు. అయితే ఈ కమెడియన్ ఇప్పుడు హీరోగా ట్రై చేస్తున్నాడు. ఇటీవల ఫస్ట్ లుక్స్ ని కూడా రిలీజ్ చేశాడు.

సక్క పోడుపొడు రాజా అనే రొమాంటిక్ కామెడీ చిత్రం ద్వారా హీరోగా అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. డిసెంబర్ లో సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే కమెడియన్ గా నవ్వించిన సంతానం పోస్టర్స్ లో చాలా హ్యాడ్సమ్ గా ఉన్నాడు. హీరోయిన్ వైభవి శాండీల్యా తో కెమిస్ట్రీ కరెక్ట్ గా సెట్ అయ్యినట్లు కనిపిస్తోంది. సేతురామన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను విటివి గణేష్ నిర్మిస్తున్నారు. మరి సినిమా ప్రేక్షకుల్ని ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.