Begin typing your search above and press return to search.

సంక్రాంతి సినిమాలు రిలీజ్ డేట్స్ ఇవే ?

By:  Tupaki Desk   |   15 Sep 2019 6:09 AM GMT
సంక్రాంతి సినిమాలు రిలీజ్ డేట్స్ ఇవే ?
X
ఓ నాలుగైదు నెలల ముందే సంక్రాంతి సినిమాలు ఫిక్స్ అవుతాయి. వచ్చే ఏడాది పొంగల్ కి ఓ నాలుగు సినిమాలు పోటీలో ఉన్న విషయం తెలిసిందే. కాకపోతే ఇంత వరకూ వాటి రిలీజ్ డేట్స్ మాత్రం ప్రకటించలేదు. లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం వీటి రిలీజ్ డేట్స్ లాక్ అయ్యాయని తెలుస్తుంది. ఇటివలే నలుగురు నిర్మాతలు ఓ కొలిక్కి వచ్చి తేదీలు ఫిక్స్ చేసుకున్నారట.

మహేష్ బాబు 'సరిలేరు నీకెవ్వరు', అల్లు అర్జున్ 'అల వైకుంఠపురములో' తో పాటు కళ్యాణ్ రామ్ 'ఎంత మంచి వాడవురా' సంక్రాంతి బరిలో నిలిచాయి. అయితే వీటితో పాటు రజినీకాంత్ 'దర్బార్' సినిమా కూడా డబ్బింగ్ సినిమాగా సంక్రాంతికే రిలీజ్ అవుతుంది. ఈ సినిమా జనవరి 10న రిలీజ్ అంటున్నారు. 'దర్బార్' విడుదలైన మరుసటి రోజు అంటే జనవరి 11న మహేష్ థియేటర్స్ లోకి ఎంట్రీ ఇస్తాడని సమాచారం. బన్నీ 'అలా వైకుంఠపురములో' సినిమాను జనవరి 12 న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ మూడు సినిమాలు విడుదలయ్యాక సరిగ్గా సంక్రాంతి రోజు అంటే 15వ తారీఖున కళ్యాణ్ రామ్ సినిమా రానుంది. శతమానం భవతి సెంటిమెంట్ తో ఈ డేట్ ని లాక్ చేసుకున్నారు.

ఇప్పటికే డేట్స్ లాక్ చేసేసుకున్న మేకర్స్ ఇంకా అఫీషియల్ గా అనౌన్స్ చేయట్లేదు. ప్రస్తుతానికైతే అందరూ సంక్రాంతి రిలీజ్ అంటూనే ప్రమోట్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం షూటింగ్ స్టేజిలోనే ఉన్న ఈ నాలుగు సినిమాలు వన్స్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసాక రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేసే అవకాశం ఉంది. ఏదేమైనా ఈసారి సంక్రాంతి పోటీ రంజుగా ఉండబోతుంది. మరి వీటిలో ఏ సినిమాలు ప్రేక్షకులను మెప్పించి బ్లాక్ బస్టర్స్ అవుతాయో...?