Begin typing your search above and press return to search.

అంత‌రిక్షం 3డిలో?

By:  Tupaki Desk   |   15 Dec 2018 4:29 AM GMT
అంత‌రిక్షం 3డిలో?
X
ఆయ‌న భూమ్మీద సినిమాలు తీయ‌డు. స‌ముద్రంలోనో లేదా అంత‌రిక్షంలోకో వెళ్లి సినిమాలు తీస్తాడు. అలాంటి నేప‌థ్యంతోనే కిక్కు అని భావిస్తాడు. అలాంటి క‌థ‌ల్నే ఎంచుకుని సంతృప్తి ప‌డుతున్నాడు. త‌న సినిమాల‌కు భూమ్మీద ఇన్సిడెంట్స్‌ ని మాత్ర‌మే ఉప‌యోగించుకుంటాడు. ఈ లాజిక్ ఏంటో అర్థం చేసుకోవాలంటే కాస్త క‌ష్ట‌మే. చేసింది రెండు సినిమాలే అయినా రాజ‌మౌళి అంత‌ ఖ్యాతి ఘ‌డించాడు!! ఇంత‌కీ ఎవ‌రా యువ‌ద‌ర్శ‌కుడు? అంటే ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం చేయాల్సిన ప‌నేలేదు. యంగ్ డైన‌మైట్ సంక‌ల్ప్ రెడ్డి గురించే ఈ ప్ర‌శంస‌.

స‌ముద్రం.. జ‌లాంత‌ర్గామి నేప‌థ్యం అంటూ పెద్ద షాకిచ్చాడు తొలి ప్ర‌య‌త్న‌మే. ఆ సినిమా తీయ‌డానికి వైజాగ్ బీచ్‌ లో ప్ర‌ద‌ర్శ‌న‌కు పెట్టిన‌ కురుసుర స‌బ్‌ మెరైన్ ని చూడ‌డ‌మే కార‌ణ‌మ‌ని ఇదివ‌ర‌కూ చెప్పాడు. తొలి ప్ర‌య‌త్నం ఘాజీ సంచ‌ల‌న విజ‌యం సాధించింది. ఈ సినిమాని ఇప్ప‌టికీ డిజిట‌ల్ వేదిక‌పై ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఆడియెన్ నిరంత‌రం చూస్తూనే ఉన్నారు. ప్ర‌స్తుతం ఏకంగా `అంత‌రిక్షం` అంటూ స్పేస్ - స్పేస్ సెంట‌ర్ నేప‌థ్యంలోనే సినిమా తీశాడు. ఈ సినిమా తీయ‌డానికి కార‌ణం ఆస‌క్తిక‌రం. ఒక ప‌త్రిక‌లో ఆర్టిక‌ల్ చ‌దివి `అంత‌రిక్షం 9000కెఎంపీహెచ్` సినిమా తీసానని సంక‌ల్ప్ చెప్పాడు.

సంక‌ల్ప్ మాట్లాడుతూ-``ఈ సినిమా తీయ‌డానికి ముందు హాలీవుడ్ గ్రావిటీ - ఇంటర్‌ స్టెల్లార్ - తమిళం నుంచి వచ్చిన టిక్‌ టిక్‌ టిక్ లాంటి సినిమాల్ని చూశాను కానీ... నా కథకి మాత్రం వీటితో సంబంధం లేదు. ఒక సినిమాని చూసి స్ఫూర్తి పొందాను అంతే. ఈ సినిమా కోసం 1500 పైచిలుకు విజువల్‌ ఎఫెక్ట్స్‌ షాట్స్ తీశాను. 40 రోజులపాటు జీరో గ్రావిటీ సన్నివేశాల్ని తీశాం. సినిమా సెట్స్‌ పైకి వెళ్లకముందే మొత్తం స్టోరీ బోర్డ్‌ తయారు చేసుకొని - మినియేచర్స్‌ - యాక్షన్‌ ఫిగర్స్‌ తో స్పై కెమెరాల్ని ఉపయోగించి కొన్ని సన్నివేశాల్ని చిత్రీకరించాను. ఇక ఇలాంటి సినిమాలు తీసేప్పుడు లాజిక్ అనేదేం ఉండ‌దు. సినిమాటిక్ లిబ‌ర్టీస్‌ తోనే తీయాలి. ఇక అంత‌రిక్షం సినిమాని 3డిలో తీయాల‌ని ఉంది. ఇక లాజిక్ జోలికి వెళితే అది డాక్యుమెంట‌రీ అవుతుంది. వాస్త‌వానికి జ‌లాంత‌ర్గామి పైకి వెళ్ల‌డం - కిందికి క‌ద‌ల‌డం అన్న‌ది ఉండ‌నే ఉండ‌ద‌ని టాప్ సీక్రెట్‌ని లీక్ చేశాడు. మొత్తానికి సంక‌ల్ప్ మేధోత‌నాన్ని జ‌నం మెచ్చుకోకుండా ఉండ‌లేరు. అత‌డికి అంత‌రిక్షం సినిమాతో మ‌రోసారి జాతీయ అవార్డు ద‌క్క‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. అంత‌రిక్షం చిత్రం ఈ శుక్ర‌వారం రిలీజ్‌ కి రెడీ అవుతున్న సంగ‌తి తెలిసిందే.