అమ్మకు చెప్పకుండా ముద్దు సీన్లు తీశారు!!

Sun Oct 21 2018 13:31:08 GMT+0530 (IST)

మీటూ ఉద్యమం హీరోయిన్ జీవితాల్లోని కొత్త కోణాల్ని బయటి ప్రపంచానికి తెలియని కథలను పరిచయం చేస్తోంది. ప్రభాస్ బుజ్జిగాడు సినిమాలో హీరోయిన్ త్రిష చెల్లిగా నటించిన అమ్మాయి గుర్తుందిగా. సంజనా గల్రాని. ఆ మధ్య పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ లో తళుక్కున మెరిసింది ఈ బ్యూటీనే. మీటూలో భాగంగా సంజనా కూడా తన ఫ్లాష్ బ్యాక్ ను షేర్ చేసుకుని ఫ్యాన్స్ ని షాక్ కి గురి చేసింది.సంజనా మొదటి సినిమా కన్నడలో వచ్చిన గండా హెండతి. తనకు అప్పుడు వయసు 15. ఇంకా 11వ తరగతి చదువుతోంది. ఈ మూవీ అప్పట్లో బాలీవుడ్ లో మల్లికా శెరావత్ హాట్ హాట్ బోల్డ్ సీన్స్ కిస్సెస్ తో సంచలనం రేపిన మర్డర్ కు రీమేక్. కథ చెప్పినప్పుడు ఇదే సందేహాన్ని సంజనా తల్లి వ్యక్తం చేస్తే మన ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు చాలా మార్పులు చేసానని కేవలం ఒకే ఒక్క కిస్ సీన్ ఉంటుందని చెప్పి దర్శకుడు రవి శ్రీవాత్సవ ఒప్పించాడు.

తీరా సెట్ లోకి అడుగు పెట్టాక హిందీ ఒరిజినల్ కు ఏ మాత్రం తీసిపోని మసాలా కంటెంట్ తో సినిమా తీయడం మొదలుపెట్టిన దర్శకుడు లెక్కలేనన్ని ముద్దు సీన్లతో పాటు హాట్ బోల్డ్ సీన్స్ కూడా షూట్ చేయించాడట. తల్లి నుంచి అభ్యంతరం రాకుండా ఆవిడ లేకుండా చేసి పూర్తి చేసేవాడట. ఇదేమని అడిగితే మాట వినకపోతే కెరీర్ నాశనం అవుతుందని చెప్పి బెదిరింది తాను అనుకున్న విధంగా సినిమా పూర్తి చేసాడు. తనకు మాత్రమే ఇలా జరిగిందని అనుకున్న సంజనా ఇప్పుడు మీ టూలో అంత కన్నా దారుణమైన కథలు బయటికి వస్తుండటంతో బయట పెట్టానని చెబుతోంది. బాహుబలి నిర్మాతలు ఆర్కా మీడియా నిర్మిస్తున్న సీరియల్ స్వర్ణఖడ్గంలో సంజనా ఓ కీలక పాత్ర చేస్తోంది.