బాలీవుడ్ అర్జున్ రెడ్డి దర్శకుడు మనవాడే

Thu Jan 18 2018 12:22:21 GMT+0530 (IST)

టాలీవుడ్  లో చిన్న వర్షంలా మొదలై తూఫానులా మారి కలెక్షన్ వర్షం కురిపించిన అర్జున్ రెడ్డి సినిమా మీద అన్ని బాషల వాళ్ళు కన్నేసిన సంగతి తెలిసిందే. తమిళ్ లో విక్రం కొడుకు ధృవ్  హీరోగా బాలా దర్శకత్వంలో ఇది ఇప్పటికే ఖరారైన సంగతి తెలిసిందే. కన్నడలో కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి కాని హీరో సెలక్షన్ ఇంకా పూర్తి కాలేదు. ఇక బాలీవుడ్ లో మాత్రం దీనికి సంబంధించిన అడుగులు చకచక పడుతున్నాయి. హింది వెర్షన్ కూడా సందీప్ రెడ్డి వంగానే టేకప్ చేయబోతున్నట్టు  బాలీవుడ్ మీడియా కథనం. దీన్ని మురద్ కేతాని - అశ్విన్ వర్దె సంయుక్తంగా నిర్మించబోతున్నారు. వీళ్ళు ఈ మధ్యే హిందిలో ముబారకే అనే మూవీ అర్జున్ కపూర్ హీరోగా తీసారు. ఇలియానా హీరొయిన్ గా నటించిన ఆ మూవీ ఓ మోస్తరుగా ఆడింది .ఇక హింది వెర్షన్ అర్జున్ రెడ్డిలో హీరోగా అర్జున్ కపూర్ హీరోగా నటించడం దాదాపు ఖాయం అయినట్టే. అధికారికంగా ప్రకటన రాలేదు కాని ఫైనల్ చేసారని టాక్. గతంలో ఒక ఆప్షన్ గా వరుణ్ ధావన్ ను అనుకున్నారు కాని కామెడీ సినిమాలు చేస్తున్న అతనితో ఇంత ఇంటెన్సిటీ ఉన్న లవ్ స్టొరీ వర్క్ అవుట్ అవుతుందా లేదా అనే అనుమానాల మధ్య చివరికి డ్రాప్ అయ్యారట. ఇది ఇప్పుడు అర్జున్ కపూర్ కు ఓకే అయ్యేలా ఉంది. సినిమా ఇంకా మొదలు కాకుండానే నిర్మాతలు దీని మీద చాలా నమ్మకంగా ఉన్నారు.

సినిమాల్లో కంటెంట్ పరంగా కొన్ని కట్టుబాట్లు ఉండే సౌత్ లోనే ఈ సినిమా ఇంత ఘన విజయం సొంతం చేసుకున్నప్పుడు బాలీవుడ్ లో ఇది సక్సెస్ కాకపోవచ్చు అనే సందేహానికి తావే లేదు అంటున్నారు. ఒరిజినల్ లో ఉన్న ఫీల్ మిస్ కాకూడదు అంటే దాన్ని సమర్ధవంతంగా హ్యాండిల్ చేసిన సందీప్ వంగా అయితేనే న్యాయం చేయగలడు అని భావించి తననే ఒప్పించినట్టు టాక్. అర్జున్ రెడ్డి తర్వాత సందీప్ వంగా ఇంత గ్యాప్ తీసుకుని తెలుగులో కొత్త సినిమా ఏది ప్రకటించకపోవడానికి కారణం ఇదే కావొచ్చు.