ఇదేం మేకోవర్ బాబోయ్!!

Fri Jan 12 2018 21:00:01 GMT+0530 (IST)

మేకోవర్.. గత కొన్నేళ్లుగా ఈ మాట బాగా వినిపిస్తోంది. తమ అభిమానులకు థ్రిల్ కలిగించేందుకు హీరోలు తెగ ట్రై చేసేస్తున్నారు. కొన్ని సార్లు ఇది క్లిక్ అవుతోంది.. మరికొన్ని సార్లు ఫట్ మంటోంది. అయినా సరే.. ఈ ట్రెండ్ బాగానే నడుస్తోంది. అయితే.. హీరోయిన్స్ మేకోవర్ చేయడం మాత్రం కాస్త అరుదుగానే కనిపిస్తుంది.శాండల్ వుడ్ లో ఎక్కువగా.. టాలీవుడ్ లో కాస్త తక్కువగా మెరుస్తున్న బ్యూటీ సంజన గల్రానీ. తక్కువగానే అయినా కాస్త క్రమం తప్పకుండా టాలీవుడ్ సినిమాల్లో మెరిసేందుకు ట్రై చేస్తున్న ఈ బ్యూటీ.. ఇప్పుడు సడెన్ గా షాక్ ఇచ్చేసింది. ఫోటో సెషన్ కోసమో.. లేక కంప్లీట్ గా ఛేంజ్ చూపించాలని భావించిందో కానీ.. తన గెటప్ మొత్తం మార్చేసుకుని.. ఓ ఫారిన్ భామ రేంజ్ లో సిద్ధమైపోయి ఫొటోలకు పోజులు ఇచ్చేసింది. సోయగాల ఒంపుల నుంచి.. నడుం షోకుల వరకూ బాగానే ఎగ్జిబిట్ చేస్తోంది సంజన.

ముఖ్యంగా సంజన హెయిర్ స్టైల్ చూస్తే మైండ్ బ్లాంక్ అవాల్సిందే. స్కిన్ టోన్ కూడా కొంచెం మారినట్లుగా మేకప్ వేసుకుని.. హెయిర్ కలర్ కూడా ఛేంజ్ చేసి.. సంజన ఇచ్చిన పోజుకు అందరూ షాక్ తినేస్తున్నారు. ఈ ఫోటోను తనే స్వయంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సంజన.. తన కొత్త మేకోవర్ అంటోంది. అయితే.. ఎంత మేకోవర్ అయితే మాత్రం.. మరీ ఇంత మార్పేంటి బాబోయ్ అంటున్నారు అభిమానులు.