Begin typing your search above and press return to search.

ఛాన్స్ ద‌క్కితే ఆ హీరోయిన్ తో పెళ్లి అనేశాడు

By:  Tupaki Desk   |   25 July 2017 8:50 AM GMT
ఛాన్స్ ద‌క్కితే ఆ హీరోయిన్ తో పెళ్లి అనేశాడు
X
పాత ప్రేమ అంత తేలిగ్గా మ‌ర్చిపోలేర‌ని చెబుతుంటారు. ఆ మాట నిజ‌మేన‌న్న విష‌యాన్ని త‌న‌దైన శైలిలో చెప్పుకొచ్చారు సీనియ‌ర్ హీరో. బాలీవుడ్ లో వివాదాస్ప‌ద క‌థానాయ‌కుల‌కు కొర‌త లేద‌న్న సంగ‌తి తెలిసిందే. అలాంటి వారిలో ప్ర‌ముఖంగా వినిపించే పేరు సంజ‌య్ ద‌త్‌. ఈ సీనియ‌ర్ న‌టుడి మీద ఉన్న ఆరోప‌ణ‌లెన్నో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు.

మాద‌క‌ద్ర‌వ్యాల మొద‌లు అక్ర‌మ ఆయుధాల కేసులో జైలుశిక్ష అనుభ‌వించిన సంజ‌య్ ద‌త్ జీవితం సినిమాటిక్ గా ఉంటుంద‌న‌టంలో సందేహం లేదు. త‌న కెరీర్ లో ప‌లుప్రేమ‌ల్లో మునిగితేలటం అంద‌రికి తెలిసిందే. తాజాగా ఆయ‌న జీవిత‌క‌థ‌తో ఒక సినిమాను తీస్తున్నారు ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు రాజ్ కుమార్ హిరాణీ.

త్రీఇడియ‌ట్స్‌.. పీకే లాంటి బంప‌ర్ హిట్ మూవీల‌ను తీసిన హిరాణీ.. సంజ‌య్ కు మంచి స్నేహితుడు కూడా. ఇదిలా ఉంటే.. ఈసినిమాలో సంజ‌య్ ఒక్క‌ప్ప‌టి ల‌వ్వ‌ర్ .. ప్ర‌ముఖ హీరోయిన్ మాధురి దీక్షిత్ ఎపిసోడ్ కూడా ఉంటుంద‌న్న మాట వినిపిస్తోంది. వీరి ఘాటు ప్రేమ ఒక ద‌శ‌లో పెళ్లి వ‌ర‌కూ వెళ్లినా.. అది వ‌ర్క్ వుట్ కాలేద‌ని చెబుతారు. సంజ‌య్ కు నో చెప్పేసి అమెరికా వైద్యుడు శ్రీరామ్‌ ను పెళ్లాడిన మాధురి యూఎస్ వెళ్లిపోయారు. తాజాగా ఒక ఇంట‌ర్వ్యూలో సంజ‌య్ మాట ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షించ‌టంతో పాటు సంచ‌ల‌నంగా మారింది.

ఇంట‌ర్వ్యూలో భాగంగా.. మ‌రోసారి అవ‌కాశం ల‌భిస్తే ఎవ‌రిని పెళ్లి చేసుకుంటార‌న్న ప్ర‌శ్న‌ను సంజ‌య్ కు వేయ‌గా.. ఆయ‌న ఎలాంటి ఆలోచ‌న లేకుండా మాధురి దీక్షిత్ పేరును చెప్పేశారు. ఈ స‌మాధానం వైర‌ల్ గా మార‌టంతో.. నాలుక్క‌ర్చుకున్న సంజ‌య్‌.. తాను కామెడీగా ఆ మాట‌ను చెప్పిన‌ట్లుగా క‌వ‌ర్ చేసే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఒక్క‌సారి నోటి నుంచి మాట వ‌చ్చిన త‌ర్వాత‌.. ఎంత క‌వ‌ర్ చేసుకుంటే మాత్రం లాభం ఉండ‌దుగా. ఇప్పుడు అలాంటి ప‌రిస్థితే ఉంది. మొత్తానికి సీనియ‌ర్ సంజ‌య్‌.. త‌న పాత ల‌వ్ ను ఇప్ప‌టికి మ‌ర్చిపోలేక‌పోతున్నార‌న‌టానికి ఇదో ఉదాహ‌ర‌ణ‌గా ప‌లువురు వ్యాఖ్యానిస్తున్నారు.