Begin typing your search above and press return to search.

బాలీవుడ్ బాటలో శర్వా సినిమా..

By:  Tupaki Desk   |   19 Feb 2017 7:53 AM GMT
బాలీవుడ్ బాటలో శర్వా సినిమా..
X
శర్వానంద్ ఇప్పుడంటే కమర్షియల్ రూట్ లో సినిమాలు చేసేస్తున్నాడు కానీ.. మొదట్లో ఈ కుర్రాడు అన్నీ కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలతో ఆకట్టుకున్నాడు. అలాంటివాటిలో ఒకటి ప్రస్థానం మూవీ. దేవ్ కట్టా డైరెక్షన్ లో వచ్చిన ఈ చిత్రం.. ప్రతీ ఒక్కరినీ ఆకట్టుకుంది. కాన్సెప్ట్ నుంచి యాక్షన్ వరకూ ఈ చిత్రం ప్రేక్షకుల మనసుల్లో నాటుకుపోయింది.

2010లో వచ్చిన ప్రస్థానం మూవీ ఇప్పుడు బాలీవుడ్ కు వెళుతోంది. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంలో హ్యూమన్ ఎమోషన్స్ కు కొదువ ఉండదు. ఈ ప్రస్థానంను బాలీవుడ్ లో రీమేక్ చేస్తానని ఎప్పటినుంచో చెబుతున్నాడు దర్శకుడు దేవ్ కట్టా. ఇన్నేళ్లకు అది సాకారం అయింది. బాలీవుడ్ భాయ్ సంజయ్ దత్ లీడ్ రోల్ లో ప్రస్థానం చిత్రం హిందీలో రీమేక్ కానున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ వెర్షన్ ను కూడా దేవ్ కట్టానే డైరెక్ట్ చేయనున్నాడు. సంజయ్ దత్ ఇప్పటికే ఈ హిందీ ప్రస్థానానికి సైన్ కూడా చేసేశాడనే టాక్ వినిపిస్తోంది.

ప్రస్తుతం సంజయ్ దత్ భూమి చిత్రం షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఇది పూర్తయిన తర్వాత దేవ్ కట్టాతో ప్రస్థానం ప్రారంభించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. మరో రెండు ప్రాజెక్టులు కూడా సంజయ్ దృష్టిలో ఉన్నా.. ప్రస్థానం రీమేక్ ను ఫుల్ స్పీడ్ లో పిక్చరైజ్ చేసే యోచనలో ఉన్నారట మున్నాభాయ్ అండ్ దేవ్ కట్టా.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/