మొదటిసారి భన్సాలీతో మున్నాభాయ్

Thu Jan 12 2017 09:16:06 GMT+0530 (IST)

బాలీవుడ్ క్రేజీ డైరెక్టర్లలో సంజయ్ లీలా భన్సాలీ పేరు టాప్ లోనే వినిపిస్తుంది. అలాగే ప్రతీ విభిన్నమైన కేరక్టర్లు.. సినిమాలతో ఆకట్టుకోవడంలో సంజయ్ దత్ కు బోలెడంత గుర్తింపు ఉంది. అయితే.. ఇప్పటివరకూ వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా రాకపోవడం.. బాలీవుడ్ కి లోటు అనే చెప్పాలి. ఇప్పుడు ఆ లోటు తీరిపోయే క్షణం రానుందట.

ప్రస్తుతం భన్సాలీ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం పద్మావతి. టైటిల్ రోల్ లో దీపికా పదుకొనే యాక్ట్ చేస్తుండగా.. షాహిద్ కపూర్.. రణవీర్ సింగ్ లు ప్రధాన పాత్రు పోషిస్తున్నారు. ఇప్పటికే ఐశ్వర్యారాయ్ ఓ స్పెషల్ రోల్ కనిపించనుందనే న్యూస్ ఉంది. అయితే.. ఈ మూవీలో ఓ ప్రధానమైన సన్నివేశంలో వచ్చే కీలక పాత్ర ఒకటి ఉంటుందట. ఇందులో సంజయ్ దత్ ని నటింపచేసే యోచన చేస్తున్న భన్సాలీ.. ఈ మేరకు సంజయ్ దత్ తో చర్చలు కూడా జరిపినట్లు తెలుస్తోంది.

తాజాగా ఓ అర్ధరాత్రి రెండు గంటలకు పైగా జరిగిన భేటీలో ఓ డెసిషన్ కు వచ్చారని తెలుస్తోంది. ఒక్క సీన్ లో కనిపించే కేరక్టరే అయినా.. మూవీకి చాలా ఇంపార్టెంట్ కావడం.. భన్సాలీతో చేసే ఛాన్స్ కావడంతో.. మున్నాభాయ్ కూడా సరే అనేసినట్లు టాక్. పద్మావతిలో భాయ్ ఎంట్రీ ఫిక్స్ అయితే.. ఈ ప్రాజెక్టుకు మరింతగా హైప్ క్రియేట్ కావడం ఖాయం.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/