హీరో కూతురు ఇలా షాకిచ్చిందేంటి!!

Wed May 16 2018 10:19:36 GMT+0530 (IST)

అందాన్ని అందంగా ప్రజెంట్ చేయడానికి ఈ రోజుల్లో అందరికి వ్యక్తి గత స్వేచ్ఛ వచ్చేసింది. హీరోయిన్స్ మోడల్స్ ఎవరి స్టైల్ లో వారు ఫొటో షూట్ లో అలాగే సినిమాల్లో షాక్ లు ఇస్తున్నారు. ఇక ఫిల్మ్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న భామలు కూడా ఈ మధ్య ఏ మాత్రం తగ్గడం లేదు. హీరోల కూతుళ్లు కూడా ఫ్యాషన్ ప్రపంచానికి బాగా అలవాటు పడటంతో గ్లామర్ డ్రెస్సుల్లో కనిపించడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఇక మరికొందరైతే ఏకంగా బికినిలో షాక్ లు ఇస్తున్నారు.బాలీవుడ్ స్టార్ కాంట్రవర్షియల్ హీరో సంజయ్ దత్ పెద్ద కూతురు త్రిషాల దత్ ఈ మధ్య ఇంటర్నెట్ లో తెగ హాల్ చల్ చేస్తోంది. ఎవరు ఊహించని విధంగా ఈ మధ్య ఆమె బికినిలో కనిపించి బాలీవుడ్ లో హాట్ టాపిక్ అయ్యేలా చేసుకుంది. చూసినవారందరు ఆమె ఎవరో మోడల్ అయ్యి ఉంటుందని కామెంట్ చేశారు. కానీ ఇన్స్టాగ్రామ్ లో ఆమె రియల్ ఫొటోలు చూసిన తరువాత అందరు ఆశ్చర్యానికి గురయ్యారు. సంజయ్ పెద్ద కూతురు ఇలా కనిపించింది ఏంటని కామెంట్స్ చేయడం వైరల్ గా మారింది.

దానికో తోడు ఆ ఫోటో చాలా బావుంది అని సంజయ్ మూడవ భార్య మాన్యత లవ్ సింబల్స్ తో చెప్పేసింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన పోస్ట్ ట్రెండ్ అవుతోంది. బాలీవుడ్ మీడియా కూడా ఈ న్యూస్ ని వైరల్ అయ్యేలా చేస్తోంది. స్టార్ హీరో కూతురు ఊహించని లుక్ లో కనిపిస్తే ఇలానే ఉంటుంది మరి.