Begin typing your search above and press return to search.

యోగా ప్రచారం ఓ రేంజులో చేస్తోంది

By:  Tupaki Desk   |   12 Feb 2016 1:30 AM GMT
యోగా ప్రచారం ఓ రేంజులో చేస్తోంది
X
బుజ్జిగాడుతో తెరంగేట్రం చేసిన కన్నడ భామ సంజన.. తర్వాత తెలుగులో చాలానే సినిమాలు చేసినా గుర్తింపు మాత్రం పెద్దగా రాలేదు. చిన్న హీరోల పక్కన నటించిన సినిమాలేవీ ఈమెకు క్రేజ్ తెచ్చిపెట్టలేకపోయాయి. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ మూవీ సర్దార్ గబ్బర్ సింగ్ లో నటిస్తుండడంతో.. ఒక్కసారిగా ఈమె టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయిపోయింది.

గతేడాది వరకూ ఈమె చేతిలో కన్నడ సినిమాలు బాగానే ఉన్నా.. ఇప్పుడు మాత్రం సర్దార్ తప్ప మరో ఆఫర్ చేతిలో లేదు. పవన్ మూవీ రిలీజ్ అయితే కానీ.. తర్వాతి ఛాన్సుల సంగతి చెప్పలేని పరిస్థితి. అందుకే ఈ మాత్రం క్రేజ్ ఉండగానే లైఫ్ సెట్ చేసేసుకోవాలని డిసైడ్ అయిపోయింది. అందుకే ఎంచక్కా ఓ వ్యాపారం మొదలుపెట్టేసింది. ఇప్పుడు హెల్త్ మీద జనాలకు బాగా కాన్సన్ ట్రేషన్ పెరుగుతుండడం, యోగాకి డిమాండ్ ఊపందుకోవడంతో.. తను కూడా ఓ యోగా సెంటర్ స్టార్ట్ చేసేసింది సంజన. ఆల్రెడీ మనకు తెలిసిందే ఈ విషయం. కాకపోతే ఏంటంటే.. ఇప్పుడు ఈ యోగ సెంటర్‌ కు బీభత్సమైన ప్రమోషన్లు మొదలెట్టేసింది.

'అక్షర్ పవర్ యోగ' అంటూ బెంగళూరు కోరమంగళలో ఓ యోగ సెంటర్ మొదలుపెట్టిందీ సర్దార్ భామ. యోగ ట్రైనింగ్ అంటే.. వీళ్లు చేయిండం కాదు.. యోగ టీచర్లుగా ట్రైనింగ్ ఇస్తారన్నమాట. యోగాలో టీచర్ గా సర్టిఫికేషన్ ప్రోగ్రాం ఇది. జనాలతో నేరుగా లింక్ అవకుండా.. ఈ కొత్త రకం వ్యాపారం బాగానే ఉంది కదూ. బెంగుళూరులో ఎక్కడ చూసినా.. ఈ యాడ్లతో దంచేస్తోందీ భామ. మరి ఎంత సంపాదించాలని స్కెచ్‌ వేసిందో ఏంటో..