బిగ్ బాస్ 2 మొదటి వికెట్

Mon Jun 18 2018 12:18:46 GMT+0530 (IST)

సినిమా తరహాలోనే డివైడ్ టాక్ తెచ్చుకున్న బిగ్ బాస్ 2 రియాలిటీ షోలో మసాలా మెల్లగా పెంచుతున్నారు. మిశ్రమ స్పందన పసిగట్టిన నిర్వాహకులు షోపై  వస్తున్న విమర్శలను జాగ్రత్తగా వడబోసి ముందు ముందు రేటింగ్స్ తగ్గకుండా పెరిగేలా పక్కా ప్లానింగ్ తో వెళ్తున్నట్టు కనిపిస్తోంది. ఇప్పటికి  ఒక్క వారమే పూర్తయ్యింది కాబట్టి రానున్న 90 రోజుల షోని అంతకంతా రసవత్తరంగా మార్చకపోతే స్టార్ మాకు ఇబ్బందులు తప్పవు. అందుకే నిన్న పూర్తయిన వీక్ ఎండ్ ఎపిసోడ్ ని సంజనా అన్నే ని ఎలిమినేట్ చేయటం ద్వారా మొదటి అడుగు వేసేసారు. నిజానికి సంజనానే ఫస్ట్ వీక్ లో కాస్త మసాలా ఉండేలా చేసింది. రాగానే బిగ్ బాస్ ఆర్డర్ మేరకు జైలుకు వెళ్లడం ఉన్నన్ని రోజులు అందరితో గొడవలు పెట్టుకోవడం బాబు గోగినేనిని హెడ్ మసాజ్ చేయమని ఆర్డర్ వేయడం ఇలా చాలానే చేసి ప్రేక్షకుల దృష్టి తన వైపే ఉండేలా చేసుకుంది. స్వతహాగా మోడల్ అవ్వడంతో  పాటు మిస్ హైదరాబాద్ కాంటెస్ట్ కు పోటీ చేసిన అమ్మాయిగా సంజనాలో మంచి స్కిల్స్ ఉన్నాయి. వాటిని ఉపయోగించే బిగ్ బాస్ షో లో హై లైట్ అవుతూ వచ్చింది. కానీ ఫైనల్ గా ఎవరు అనుకోని విధంగా తనే ముందు బయటికి రావడం బిగ్ బాస్ షో సీజన్ 2లో నిజంగా ట్విస్ట్ ఇచ్చేదే.నిజానికి సంజనా కామన్ విమెన్ క్యాటగిరీ లో తీసుకోవడం పట్ల విమర్శలు కూడా వచ్చాయి. సోషల్ మీడియాలో సంజనా నేనే రాజు నేనే మంత్రి సినిమాలో అశుతోష్ రానా పక్కన సెక్రటరీగా నటించిన స్క్రీన్ షాట్స్ షేర్ చేసి తాను ఎలా సెలబ్రిటీ అవుతుంది అంటూ నెటిజెన్లు ప్రశ్నల బాణాలు కూడా సంధించారు. ఇది బిగ్ బాస్ నిర్వాకుల దృష్టికి వెళ్ళలేదు అనుకోలేం కాబట్టి ఇప్పుడు ఈ రిజల్ట్ వచ్చినట్టు ఉంది. సంజనా స్థానంలో నందిని రాయ్ ని తీసుకొచ్చారు. సుధీర్ బాబు తో మోసగాళ్లకు మోసగాడు నీలకంఠ మాయలో నటించిన హీరోయిన్ తను. వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా సెలబ్రిటీ కోటాలోనే తీసుకొచ్చారు. ఎనిమిదేళ్ల క్రితం మిస్ ఆంధ్ర ప్రదేశ్ టైటిల్ విన్నర్. ఫస్ట్ ఎపిసోడ్ కే తనను సెలెక్ట్ చేసినప్పటికీ చిన్న యాక్సిడెంట్ కారణంగా లేట్ ఎంట్రీ ఇచ్చింది. మొత్తానికి అమ్మాయిల నెంబర్ తగ్గకుండా జాగ్రత్త పడుతున్న  బిగ్ బాస్ లో ఇప్పుడున్న మసాలా అయితే సరిపోవడం లేదు. రాను రాను డోస్ పెరుగుతుంది అన్న అంచనాల నేపథ్యంలో  నందిని రాయ్ రాక షో ని ఏ మలుపులు తిప్పుతుందో వేచి చూడాలి