భర్తతో సానియాను ఇలా చూసి ఉండరు

Wed May 16 2018 10:44:51 GMT+0530 (IST)

టెన్నిస్ పేరు చెప్పినంతనే భారత్‌లోని అందరికి సానియా గుర్తుకు వస్తుంది. ఆ మాటకు వస్తే ఆసియా మొత్తంలోనూ టెన్నిస్ మీద ఇష్టం ఉన్న వారందరికి సానియామీర్జా సుపరిచితురాలు. పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్ ను పెళ్లాడిన సానియా ఈ మధ్యనే తల్లి కాబోతున్న వార్త బయటకు వచ్చిన ముచ్చట తెలిసిందే.సానియా.. షోయబ్ లు గతంలో ఎన్నో ఫోటోలు దిగి ఉంటారు కానీ.. తాజాగా వారిద్దరూ కలిసి దిగిన ఫోటో ప్రత్యేకమని చెప్పాలి. ఎందుకంటే.. పవిత్ర రంజాన్ మాసం ప్రారంభానికి ముందే సానియాషోయబ్ జంట వారి పేరెంట్స్ తో కలిసి ఉమ్రా యాత్రకు రావటం ఆసక్తికరంగా మారింది. సంప్రదాయబద్ధంగా ధరించిన వస్త్రాలతో సానియా సరికొత్తగా కనిపించటం ఖాయం.

సానియా నిండుగా.. గుర్తించలేని రీతిలో వస్త్రాల్ని ధరిస్తే.. షోయబ్ మాత్రం ఎప్పటిలానే జీన్స్.. వైట్ టీషర్ట్ తో క్యాజువల్ గా ఉండటం కనిపిస్తుంది. వీరి ఉమ్రా యాత్రకు సంబంధించిన ఫోటోల్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయటంతో అవి కాస్తా వైరల్ గా మారాయి. ఒక ఫోటోలో షోయబ్ క్యాజువల్ గా ఉన్నప్పటికీ.. మరో ఫోటోలో మాత్రం సానియా.. ఆమె తండ్రితో కలిసి దిగిన ఫోటోలో మాత్రం షోయబ్ సైతం సంప్రదాయబద్ధంగా ధవళ వస్త్రాన్ని నిలువెత్తుగా కప్పుకోవటం కనిపిస్తుంది. ఏమైనా.. ఇప్పటివరకూ సానియాకు సంబంధించిన మీరు చూసిన ఫోటోలకు భిన్నమైంది తాజా ఫోటో అని చెప్పక తప్పదు.