Begin typing your search above and press return to search.

ఉద్వేగంతో ఊగిపోయిన సానియా!!!

By:  Tupaki Desk   |   31 Aug 2015 3:43 AM GMT
ఉద్వేగంతో ఊగిపోయిన సానియా!!!
X
టెన్నిస్‌ సంచలనం సానియా మీర్జా జీవితంలో మెరుపులే మెరుపులు. ఒక క్రీడాకారిణి/ క్రీడాకారుడు ఖేల్‌ రత్న అవార్డ్‌ అందుకోవడం అంటే ఆషామాషీ కాదు. కానీ సానియా ప్రతిభకు, కఠోర శ్రమకు గుర్తింపుగా ఖేల్‌ రత్న పురస్కారం కీర్తి కిరీటంలో చేరింది. నిన్నటిరోజున ఖేల్‌ రత్న అందుకున్న సందర్భంగా సానియా ఎంతో ఉద్వేగానికి లోనైంది. ఇలాంటి అవార్డులు అందుకున్న వేళ మరింత హంబుల్‌ గా, డౌన్‌ టు ఎర్త్‌ ఉంటానంటే చెప్పుకొచ్చింది. ఏదో ఫేస్‌ బుక్‌, ట్విట్టర్‌ లో 200 మంది ఫాలోవర్స్‌ ఉంటే అది గొప్ప కాదు. 1.2 బిలియన్‌ జనాలు నన్ను ప్రేమిస్తున్నారంటూ ఎంతో ఉద్వేగంతో మాట్లాడింది. అందుకే ఈ విజయాలన్నీ సాధ్యమయ్యాయని చెప్పింది. ఇదంతా సరే అదే 1.2 బిలియన్‌ ఆడియెన్‌ సానియా ఎప్పుడు కథానాయిక అవుతుందా? అని ఎదురు చూస్తున్న సంగతిని సానియా గుర్తించలేకపోతోంది.

అసలు సానియా అందం ఓ సినిమా స్టార్‌ కి ఏమాత్రం తక్కువ కాదు. సక్సెస్‌ తో వచ్చిన గ్లో, దాంతో పాటే నేచురల్‌ బ్యూటీ తన సొంతం. వెండితెరపైనా మెరుపులు మెరిపించే సత్తా తనకి ఉంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా వెల్‌ నోన్‌ ఫేస్‌ కాబట్టి సానియా తన జీవిత కథలో తనే నటిస్తే బావుంటుందని ఫిలింనగర్‌, కృష్ణానగర్‌ దర్శకులు భావిస్తున్నారు. ఇప్పటికే సానియా కోసం కథలు కూడా రాసుకున్నారు. మొన్నటిరోజున ముంబై ఫ్యాషన్‌ వీక్‌ లో పట్టు చీరలో తళుక్కుమన్న ఆ రూపాన్నే ఊహించుకుంటూ కుర్ర దర్శకులు కలలు కంటున్నారు. ప్చ్‌ ! సానియా ఏమంటుందో? సినిమాల్లో కొస్తుందో రాదో?..ప్ఛ్‌????