కంచె లో ఆ లెజెండ్ నటిస్తున్నాడు

Tue Sep 08 2015 15:11:08 GMT+0530 (IST)

ఇదిగో ఇక్కడ డైరెక్టర్ క్రిష్ పక్కన నిలబడ్డ పెద్దాయన ఎవరో గుర్తుపట్టండి.. ఆయనో లెజెండరీ డైరెక్టర్ అంటూ నిన్న ట్విట్టర్లో అందరికీ పరీక్ష పెట్టాడు హీరో వరుణ్ తేజ్. ఆ వ్యక్తిని గుర్తు పట్టడం అంత వీజీయేమీ కాదు. నటుడికి మేకప్ వేస్తే గుర్తు పట్టేయొచ్చు కానీ.. డైరెక్టర్ కు మేకప్ వేస్తే ఎలా కనుక్కుంటాం. చాలామంది బోల్తా కొట్టేశారు. ఆ తర్వాత డైరెక్టర్ క్రిష్ ఈ ప్రశ్నకు బదులిస్తూ.. అక్కడున్నదది ఇండియన్ సినిమా మనకందించిన లెజెండ్ సింగీతం శ్రీనివాసరావు అని వెల్లడించారు. అవును.. అలనాటి మేటి దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు ‘కంచె’ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. అది కొన్ని నిమిషాలు కనిపించే అతిథి పాత్ర కూడా కాదు. కెరీర్లో తొలిసారి ఓ పూర్తి స్థాయి పాత్రలో నటిస్తున్నారు సింగీతం. ఆయన గతంలోనూ రెండు మూడు సినిమాల్లో తళుక్కుమన్నారు.ఈ మధ్యే చిన్ని చిన్న ఆశ అనే తెలుగు సినిమాలో ఓ కీలక పాత్రలో నటించారు కానీ.. అది విడుదలకు నోచుకోలేదు. ఐతే ‘కంచె’ లాంటి క్రేజీ సినిమాలో ఆయన నటించడం విశేషమే. ఈ సినిమాతో మంచి పేరొస్తే.. విశ్వనాథ్ తరహాలో సరికొత్తగా కెరీర్ ను మలుచుకుంటారేమో చూడాలి. 1947 బ్యాక్ డ్రాప్ లో రానున్న ఈ సినిమాలో ఓ పాత్రకి ఆయనైతేనే పర్ఫెక్ట్ అని సింగీతంని ఎంచుకున్నట్లు క్రిష్ చెబుతున్నాడు. సింగీతం అంటేనే భారీ ప్రయోగాలకు పెట్టింది పేరు. ఇప్పుడు క్రిష్ చేస్తున్న ప్రయోగాత్మక సినిమాలో ఆ లెజెండ్ కూడా భాగమయ్యాడు. బాలకృష్ణతో ‘ఆదిత్య 999’ చేయాలని తపిస్తున్న సింగీతం ‘కంచె’ నుంచి ఏమైనా రిఫరెన్సులు తీసుకున్నా తీసుకుని ఉండొచ్చు. 80 ప్లస్ వయసులోనూ ఆయన ఉత్సాహం చూస్తే ఎవరికైనా ముచ్చటేయక మానదు. ఈ 83 ఏళ్ల కుర్రాడి నట విన్యాసాలు ఎలా ఉండబోతున్నాయో అక్టోబరు 2న చూద్దాం.