Begin typing your search above and press return to search.

కేన్స్ లో బాహుబలికి మొదలైన పోటీ

By:  Tupaki Desk   |   18 May 2017 11:07 AM GMT
కేన్స్ లో బాహుబలికి మొదలైన పోటీ
X
బాహుబలి మూవీ ఎన్నో సంచలనాలతో పాటు కొత్త కొత్త ఆలోచనలను తీసుకొచ్చింది. కొత్త మార్కెట్లను కూడా ఓపెన్ చేసింది. కమిట్మెంట్ తో తీయాలి కానీ.. ఏ స్థాయిని అయినా అందుకోవచ్చని ప్రూవ్ చేయడంతో.. ఈ తరహా భారీ బడ్జెట్ చిత్రాలు తీసేందుకు ఇప్పుడు పలువురు మేకర్స్ సిద్ధమవుతున్నారు.

బాహుబలి2 విజయం కంటే ముందే అనౌన్స్ అయిన ప్రాజెక్ట్ సంఘమిత్ర. తమిళంలో రూపొందనున్న ఈ చిత్రాన్ని దేశవ్యాప్తంగా పలు భాషల్లోకి అనువదించనున్నారు. ఈ మూవీ అధికారిక ప్రకటన కోసం ఇప్పుడు టీం అంతా కేన్స్ లో వాలిపోయింది. దర్శకుడు సి సుందర్ రూపొందించనున్న ఈ మూవీలో శృతి హాసన్ టైటిల్ రోల్ పోషించనుండగా.. జయం రవి- ఆర్యలు ప్రదాన పాత్రల్లో కనిపించనున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించనుండగా.. సాబు సిరిల్ ఆర్ట్ డిపార్ట్ మెంట్ ను నిర్వహించనున్నారు.

సంఘమిత్ర కోసం శృతి హాసన్ కత్తి యుద్ధాల్లో ప్రత్యేకంగా ట్రైనింగ్ అయింది. 8వ దశాబ్దంలో కథా గమనం ఉంటుందని చెబుతున్నారు. అందంలో తిరుగులేని సంఘమిత్ర.. తన రాజ్యాన్ని ప్రజలను కాపాడుకునేందుకు చేసే వీరోచిత పోరాటమే ఈ సినిమా కథ. రెండు భాగాలుగా సంఘమిత్ర తెరకెక్కనుండగా.. తమిళ చిత్ర స్థాయిని ప్రపంచానికి చాటే రేంజ్ లో రూపొందించేందుకు దర్శకుడు సిద్ధమవుతున్నాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/