Begin typing your search above and press return to search.

బాలీవుడ్ రెడ్డి కాస్త డిఫరెంట్ గా..

By:  Tupaki Desk   |   21 May 2018 5:36 AM GMT
బాలీవుడ్ రెడ్డి కాస్త డిఫరెంట్ గా..
X
టాలీవుడ్ లో ట్రెండ్ సెట్ చేసిన అర్జున్ రెడ్డి సినిమా గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే. టాలీవుడ్ గాలిని ఇతర ఇండస్ట్రీలకు కూడా తగిలిచింది. ఆ సినిమా అందించిన విజయంతో ఉన్న సందీప్ మళ్లీ అదే కథ అతన్ని పిలిచింది. బాలీవుడ్ లో అర్జున్ రెడ్డి రీమేక్ పనులు జరుగుతున్న సంగతి తెలిసిందే. సందీప్ వంగ షాహిద్ కపూర్ ని అర్జున్ రెడ్డిగా చూపించబోతున్నాడు. షాహిద్ కూడా ఆ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేయడానికి రెడీగా ఉన్నాడు.

అయితే సౌత్ సినిమాలకు నార్త్ సినిమాలకు తేడా చాలా ఉంటుందని అందరికి తెలిసిందే. అక్కడి సినిమాల వాతావరణం చాలా డిఫరెంట్ గా ఉంటుంది. స్క్రీన్ ప్లే అలానే ఉన్నా కూడా తెరకెక్కించే విధానంలో చాలా మార్పులు చేయాలి. అక్కడి ప్రేక్షకుల అభిరుచుకి తగ్గట్టు సినిమాను ప్రజెంట్ చేయాలి కాబట్టి దర్శకుడు సందీప్ స్క్రిప్ట్ పనుల్లో మార్పులు చేస్తున్నాడు. తన కథను మళ్లీ తనే దగ్గరుండి మళ్లీ కొత్తగా అల్లుతున్నాడు. అక్కడ సెన్సార్ ఫ్రీడమ్ కాస్త ఎక్కువగా ఉండడంతో మసాలా డోస్ గట్టిగా పెంచవచ్చు అని తెలుస్తోంది.

ప్రస్తుతం ప్రతి పాత్ర విధానం అలాగే లొకేషన్స్ విషయంలో మార్పులు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో సందీప్ మాట్లాడుతూ..హిందీ అర్జున్ రెడ్డి ని మళ్లీ నేనే చేస్తాను అని అనుకోలేదు. చాలా ఆసక్తికరంగా ఉంది. కానీ ఇది ఒక రీమేక్ లా కాకుండా. మళ్లీ నా సొంత కథలాగా కొత్తగా ప్రజెంట్ చేయడానికి ప్రయత్నిస్తాను. బట్.. ఆ మ్యాజిక్ మిస్ అవ్వకుండా చూసుకునేందుకు స్క్రిప్ట్ వర్క్ చేయాల్సి ఉందని దర్శకుడు వివరించాడు. జూన్ మొదటి వారంలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.