Begin typing your search above and press return to search.

కిస్సులిస్తున్న కర్నూల్ లాయర్!

By:  Tupaki Desk   |   14 Sep 2019 10:15 AM GMT
కిస్సులిస్తున్న కర్నూల్ లాయర్!
X
హీరో సందీప్ కిషన్ చాలా కాలం సరైన హిట్టుకోసం ఎదురూ చూస్తున్నాడు. ఫైనల్ గా ఆ నిరీక్షణ సందీప్ లాస్ట్ సినిమా 'నిను వీడని నీడను నేనే' సినిమాతో ఫలించింది. ఆ సినిమాకు సందీప్ నిర్మాత కూడా కావడంతో డబల్ ఖుష్ అయ్యాడు. ఆ సినిమా విజయంతో మళ్ళీ ఫామ్ లోకి వచ్చిన సందీప్ త్వరలో 'తెనాలి రామకృష్ణ BA BL' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. కామెడీ చిత్రాలకు పర్మనెంట్ అడ్రెస్ అయిన జీ. నాగేశ్వరరెడ్డి ఈ సినిమాకు దర్శకుడు.

ఈ సినిమా టీజర్ ను ఆదివారం ఉదయం 11 గంటలకు విడుదల చేస్తున్నామంటూ సందీప్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ప్రకటించాడు. తన ఇన్స్టా ఖాతా ద్వారా ఒక కొత్త పోస్టర్ ను షేర్ చేస్తూ "తెనాలి రామకృష్ణ BA BL ను కలిసేందుకు రెడీ అవ్వండి. కర్నూల్ టౌన్ లో ఏ కేస్ అయినా డీల్ చేయగలిగే ఏకైక లాయర్" అంటూ సూపర్ ఇంట్రడక్షన్ కూడా ఇచ్చాడు. ఇక పోస్టర్ విషయానికి వస్తే బుంగమూతి పెట్టిన హీరోయిన్ హన్సిక బుగ్గపై గట్టిగా ముద్దు పెట్టుకుంటున్నాడు. అంతవరకూ మేలు.. సందీప్ ఈజ్ ఎ గుడ్ బాయ్ అని ఫిక్స్ అయిపోండి. ఇతర హీరోలైతే చచ్చినా బుగ్గల మీద ముద్దు పెట్టడం లేదు!

సరే ఇంకో విషయం ఏంటంటే సందీప్ ఈమధ్య వరసబెట్టి సీనియర్ హీరోయిన్ లతో జోడీ కడుతూ రొమాన్స్ చేస్తున్నాడు. 'నెక్స్ట్ ఏంటి' సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నాతో రొమాన్స్ చేశాడు. ఇప్పుడేమో హన్సికతో అచ్చికబుచ్చికలాడుతున్నాడు. మరి ఈ సీనియర్ హీరోయిన్లతో జోడీ కట్టడం వెనక ఏమైనా కారణం ఉందా లేక జస్ట్ అనుకోకుండా అలా జరిగిపోతోందా అనేది కొందరి నెటిజన్ల అనుమానం.