మీకు లవ్ - సెక్స్ ఆసక్తా.. అయితే రండి

Wed Dec 05 2018 15:59:50 GMT+0530 (IST)

మొన్నటి వరకు బాలీవుడ్ కే పరిమితం అయిన బోల్డ్ కంటెంట్ చిత్రాలు మెల్ల మెల్లగా సౌత్ లో కూడా ఎంట్రీ ఇస్తున్నాయి. ముఖ్యంగా తెలుగు సినిమా పరిశ్రమలో వరుసగా బోల్డ్ సినిమాలు క్యూ కడుతున్నాయి. ఇప్పటి వరకు తెలుగులో వచ్చిన బోల్డ్ సినిమాలు ఒక ఎత్తు అయితే సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కి విడుదలకు సిద్దం అయిన ‘నెక్ట్స్ ఏంటీ’ చిత్రం ఒక ఎత్తు. ఈ విషయాన్ని స్వయంగా చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు. బోల్డ్ కంటెంట్ బోలెడు ఉన్న ఈ చిత్రంను విడుదల చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు.తాజాగా ఈ చిత్రం ప్రమోషన్ లో భాగంగా సందీప్ కిషన్ మీడియాతో మాట్లాడుతూ ఈ సినిమాపై యూత్ లో మరింత ఆసక్తిని పెంచాడు. సందీప్ కిషన్ ఏమాత్రం దాచుకోకుండా ఉన్న విషయాన్ని చేప్పేశాడు. ఎవరికైతే ప్రేమ మరియు సెక్స్ లపై ఆసక్తి ఉంటుందో వారికి మా సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది. ప్రతి ఒక్కరికి ఆ రెంటిలో ఏదైనా ఒకటి లేదా రెండు కూడా ఆసక్తి ఉండటం ఖాయం. కనుక తప్పకుండా మా సినిమా అందరిని ఆకట్టుకుంటుందనే నమ్మకంను వ్యక్తం చేశాడు.

ఈ సినిమాను ఫ్యామిలీతో చూడాలనే ఆలోచన అస్సలు వద్దని సందీప్ కిషన్ అన్నాడు. ఫ్యామిలీతో మొదటి రోజు మీరు సినిమా చూడవద్దని ఆ తర్వాత ఎప్పుడైనా ఫ్యామిలీతో వెళ్లొచ్చు అన్నాడు. ఆ తర్వాత రోజు ఫ్యామిలీస్ తో వెళ్లినా కూడా ఫ్యామిలీస్ కు దూరంగా కూర్చుంటే బెటర్ అంటూ యూత్ కు సందీప్ సలహా ఇచ్చాడు. సందీప్ మాటలు చూస్తుంటే సినిమా మొత్తం బూతుల మయంగా ఉంటుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. డిసెంబర్ 7న విడుదల కాబోతున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా తమన్నా నటించింది. బాలీవుడ్ దర్శకుడు కునాల్ కోహ్లీ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. తెలుగు వారికి సుపరిచితుడు అయిన సచిన్ జోషీ ఈ చిత్రాన్ని నిర్మించాడు.