Begin typing your search above and press return to search.

జనాలు వద్దన్నా రెచ్చిపోతున్న సనా

By:  Tupaki Desk   |   17 Jan 2017 10:30 PM GMT
జనాలు వద్దన్నా రెచ్చిపోతున్న సనా
X
సనా ఖాన్ ఓ పదేళ్లుగా సినిమా ఇండస్ట్రీలో కుదురుకునేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. హిందీ సినిమాలతో పాటు తెలుగు.. కన్నడ.. తమిళ సినిమాల్లో కూడా నటించేసింది. తెలుగులో కళ్యాణ్ రామ్ కత్తి చిత్రంతో పరిచయమైన ఈ భామ.. ఆ తర్వాత గగనం.. మిస్టర్ నూకయ్య మూవీస్ లో కనిపించింది.

తాజాగా ఈ భామ ఈరోటిక్ థ్రిల్లర్ అంటూ వచ్చిన 'వజయ్ తుమ్ హో' అనే అడల్ట్ కంటెంట్ సినిమాలో నటించింది. ఇలాంటి సినిమాల్లో నటించిన భామలకు సహజంగా ఆఫర్లు వెల్లువలా వస్తుంటాయి. కానీ సనాఖాన్ అందాలను జనాలు జీర్ణించుకోలేకపోయారు. ఈ మూవీకి ఆమెనే మైనస్ పాయింట్ గా తేల్చిపడేశారు. అయినా సరే ఈ అమ్మడు మాత్రం ఏ మాత్రం తగ్గడం లేదు. తాజాగా ఎఫ్ హెచ్ ఎం మేగజైన్ కోసం హాట్ హాట్ ఫోటో షూట్ చేసి రెచ్చిపోయింది. తన హాట్ హాట్ అందాలను కెమేరాలకు అంకితం ఇచ్చేసింది. క్లీవేజ్ షోకుల నుంచి నడుం ఒంపులు.. నాభి సోయగాలు.. కాలి అందాలు.. వేటినీ వదిలిపెట్టకుండా ఫోటోలతో ఎగ్జిబిషన్ పెట్టేసింది.

తను ఎంత హాట్ గా కనిపించగలదో చెప్పకనే చెప్పింది సనా ఖాన్. మరి జనాలు ఓసారి వద్దన్నాక.. ఇలాంటి హాట్ షూట్స్ అమ్మడి కెరీర్ కి ఏమాత్రం ఉపయోగపడుతుందో చూడాలి. ప్రస్తుతం టామ్ డిక్ హారీ2 మూవీ ఒక్కటే సనా ఖాన్ చేతిలో ఉంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/