Begin typing your search above and press return to search.

కత్తి భామ లిమిట్ వద్దంటోంది

By:  Tupaki Desk   |   23 March 2018 12:38 PM GMT
కత్తి భామ లిమిట్ వద్దంటోంది
X
బాలీవుడ్ భామ సనా ఖాన్ తెలుగు ప్రేక్షకులకు కూడా బాగానే తెలుసు. కళ్యాణ్ రామ్ కత్తి మూవీలో నటించిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత మిస్టర్ నూకయ్య అంటూ మళ్లీ పలకరించింది. కానీ ఈ సినిమాలు రెండూ అంతగా ఆడకపోవడంతో ఇక్కడ మళ్లీ అవకాశాలు అందలేదు కానీ.. బాలీవుడ్ లో బాగానే దూసుకుపోతోంది ఈ బ్యూటీ.

తమిళ్.. హిందీ సినిమాల్లో వరుసగా నటించేస్తున్న సనా ఖాన్.. సోషల్ మీడియాలో కూడా మహా హాట్ గా రెచ్చిపోతూ ఉంటుంది. రీసెంట్ గా ఈ బ్యూటీ తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో ఓ హాట్ ఫోటోను షేర్ చేసింది. ఇందులో అమ్మడు తన అందాలను ప్రస్ఫుటంగా కనిపించేలా పోజులు ఇచ్చేస్తూ.. కుర్రాళ్లను తెగ రెచ్చగొడుతోంది. విండో థీమ్ డిజైనర్ డ్రెస్సులో సనా ఖాన్ సొగసులు మరీ అట్రాక్టివ్ గా కనిపిస్తున్నాయి. నాభి సొగసులను ప్రదర్శించడంలో కొంచెం కూడా కాంప్రమైజ్ కాలేదు సనా ఖాన్. అంతే కాదు.. టైట్ డ్రెస్సులో తన సౌందర్యం ఎంత ఆకర్షణీయంగా ఉంటుందో చూపించేసింది ఈ భామ.

కేవలం ఫోటో పోస్ట్ చేయడమే కాదు.. అందుకు తగినట్లుగా తన వెర్షన్ కామెంట్ ను కూడా జోడించింది సనా ఖాన్. 'ఎవరివో పరిమితమైన ఊహల కోసం.. మనం ఎప్పుడూ లిమిటెడ్ గా ఉండాల్సిన అవసరం లేదు' అంటూ తన గ్లామర్ షోను తెగ సపోర్ట్ చేసేసుకుంది ఈ బాలీవుడ్ భామ.