Begin typing your search above and press return to search.

బాబు సంపూ ఇంకా దయ చేయ్

By:  Tupaki Desk   |   26 July 2017 6:07 AM GMT
బాబు సంపూ ఇంకా దయ చేయ్
X
తెలుగులో ఇప్పుడు మాట్లాడుకోవడానికి, టి‌వి చూసే వారకి కొత్త టాపిక్ దొరికింది. ఇప్పుడు ట్రెండ్ లో ఉన్న టి‌వి షోలు అంటే అవి రియాలిటీ షోలు అనే చెప్పాలి. తెలుగులో రియాలిటీ షోలు గేమ్ షో లు తక్కువే అయన ఇప్పుడు ఆ లోటు కూడా తీరిపోయింది బిగ్ బాస్ టి‌వి షో వలన. ఎన్టీఆర్ హోస్ట్ గా ప్రసారం అవుతున్న బిగ్ షో ఇప్పుడు ఇప్పుడే కొత్త మలుపులు తిరుగుతుంది. వీటిలో పాల్గొనే వారు అంతా టి‌వి - సినిమాకు సంబంధించిన వారే కావడం వలన షో ని కూడ బాగానే చూస్తున్నారు మన తెలుగు ప్రేక్షకులు.

కాకపోతే షో లో కొన్ని షరతులు కొన్ని నియమాలు ఉన్నాయి వాటిని ఎవరు పాటించకపోయిన వాళ్ళు బిగ్ బాస్ ఇంటి నుండి బయటకు పంపేస్తారు. మొదటిగా నటి జ్యోతి బిగ్ బాస్ షో నుండి తప్పించారు. ఆడియన్స్ ఓట్లతో ఎలిమినేట్ చేశారు. ఇప్పుడు మరో నటుడు పై వేటు పడింది. హృదయం కాలేయం సినిమాతో పాపులర్ అయన సంపూర్ణేష్ బాబు కూడా బిగ్ బాస్ గేమ్ షో లో కంటెస్టంట్లో ఒకడు. బిగ్ బాస్ షో నుండి మంగళవారం సంపూను తొలిగించారు. సంపూ కి కొత్త ప్రదేశాలు అంటే భయం ఉండే ఒక ఫోబియా ఉందిట. తన ప్రవర్తన కూడా ఆ ఫోబియా లక్షణాలు ఉన్న వాడి లానే అనిపిస్తుంది అని కూడా. మొన్నటి షోలో వింత వింతగా ఏడిచి అందరిని ఇబ్బంది పెట్టేసి.. చచ్చిపోతానంటూ బెదిరించాడు కూడా. కత్తితో కోసుకుందాం అని చూశాడు కూడా. అందుకే అతన్ని బిగ్ బాస్ నుండి బయటకు పంపేస్తున్నారు.

బిగ్ బాస్ మొదలై 10 రోజులు గడిచింది. బిగ్ బాస్ రూల్స్ ప్రకారం ఒకే దగ్గర కొన్ని రోజులు బయట వారికి సంబంధం లేకుండా ఒకే ఇంటిలో ఉండాలి. మరి సంపూకి నిజంగా ఈ క్లౌస్త్రోఫోబియా ఉందో లేక ఏదన్నా రాసిన స్క్రిప్ట్ ప్రకారం ఇలా యాక్టింగ్ చేస్తున్నారో తెలియటం లేదు. మొత్తానికి బిగ్ బాస్ షో లో ఇలా రోజుకు ఒక డ్రామా క్రియేట్ చేసి షో టి‌ఆర్‌ పి పెంచేస్తున్నారు. కాని సంపూ ఇలా బయటకు వెళ్లాలంటే బిగ్ బాస్ కు ఫైన్ చెల్లించాలట. నిజమేనా?