Begin typing your search above and press return to search.

కబాలిపై సంపూ మార్కు కామెడీ!

By:  Tupaki Desk   |   26 July 2016 5:28 AM GMT
కబాలిపై సంపూ మార్కు కామెడీ!
X
ప్రస్తుతం తనదైన మార్కు కామెడీతో టాలీవుడ్ ని ఒక ఊపు ఊపేస్తున్న సోషల్ మీడియా హీరో బర్నింగ్ స్టార్ సంపూర్నేష్ బాబు. సంపూర్నేష్ సినిమాల్లోకి రాకముందు కూడా సోషల్ మీడియాలో తనదైన మార్కు పోస్టులతో ఫ్యాన్స్ ని సంపాదించుకున్నాడు. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సంపూ తాజాగా ఒక విషయంపై స్పందించాడు. అది మామూలు విషయం కాదు.. సూపర్ స్టార్లకు - పవర్ స్టార్ కు సంబందించిన విషయం. దీనిపై కూడా తనదైన మార్కు కామెడీని - వెటకారాన్ని పండించాడనే చెప్పాలి.

ఈ 2016 కి ఏమైంది? ఓ పక్క సర్ధార్ గబ్బర్ సింగ్ - మరోపక్క బ్రహ్మోత్సవం. కబాలి కూడా నోరు మెదపలేదు. ఈ నిర్లక్ష దోరణికి "కొబ్బరిమట్ట" పాడాలి చరమగీతం.. అని సంపూ తాజాగా ట్వీట్ చేశాడు. ఈ మధ్యకాలంలో భారీ అంచనాలతో విడుదలవుతున్న భారీ సినిమాలు వరుసగా ఫ్లాప్ అవ్వడంతో సంపూ చేసిన ట్వీట్ కి ఫుల్ మైలేజ్ వచ్చింది. పెద్ద పెద్ద హీరోల సినిమాలు ఫెయిల్ అయ్యాయని చెబుతూనే.. తన కొబ్బరి మట్ట సినిమాను తనదైన శైలిలో ప్రమోట్ చేసుకుంటున్నాడు సంపూ.

ఇలా భారీ స్టార్స్ - భారీ సినిమాలపై ఇండస్ట్రీలోని వారే బహిరంగంగా కామెంట్ చేసే సాహసం ఎవరూ చేయరు.. కానీ చేసింది సంపూ కాబట్టి.. అంతా హాయిగా నవ్వుకుంటున్నారు. ఇది సంపూ మార్కు సెటైరైనా.. వాస్తవమైతే దాగుందిగా అనేది సంపూ ఫ్యాన్స్ వాదన!