Begin typing your search above and press return to search.

ఆలీ ప్లేస్ లోకి సంపూ వచ్చేశాడు

By:  Tupaki Desk   |   10 Feb 2016 5:05 AM GMT
ఆలీ ప్లేస్ లోకి సంపూ వచ్చేశాడు
X
మా టీవీ నిర్వహించే అవార్డు ఫంక్షన్ కి ఎంత క్రేజ్ ఉందో.. ఆ ఫంక్షన్ లో ప్రదర్శించే మినీ మూవీకి కూడా అంతే డిమాండ్ ఉంటుంది. ఈ అవార్డులను ప్రారంభించినప్పటి నుచి ఇప్పటివరకూ ఆలీ - సుమ కాంబినేషన్ లో.. ఈ ఎపిసోడ్ ని చేయడం ఆనవాయితీ. వాళ్లే యాంకర్స్ కూడా. కానీ ఇప్పుడు ట్రెండ్ మారుతున్నట్లు అనిపిస్తోంది.

బూతులు మాట్లాడుతున్నాడనే విమర్శల కారణంగా.. వేడుకల్లో యాంకరింగ్ కి ఆలీ దూరంగా ఉంటున్నాడు. ఈ ఎఫెక్ట్ మాటీవీ అవార్డు ఫంక్షన్ పైనా, వాళ్లు తీసే షార్ట్ ఫిలిం పైనా పడ్డట్లుగా కనిపిస్తోంది. మా టీ అవార్డ్స్ ఈ నెలలోనే అంటూ మాటీవీ ఇప్పుడో ప్రోమో టెలికాస్ట్ చేస్తోంది. ఇందులో బాహుబలి స్పూఫ్ ని బాగానే తీసేశారు. కళామతల్లి అండ్ శివగామి పాత్రలో ఎప్పటిలాగే సుమ నటించగా.. బాయిలింగ్ స్టార్ పృథ్వీ కట్టప్ప పాత్రలో కనిపించనున్నాడు. ఇక బాహుబలిగాను, పైరసీకేయ గాను సంపూర్ణేష్ బాబు కనిపించనున్నాడు.

ఈ సంపూ చేసిన రోల్స్ ను సాధారణంగా ఆలీ చేయాల్సి ఉంటుంది. కానీ రీజన్ ఏంటో తెలీదు కానీ.. ఆలీ ప్లేస్ లోకి సంపూ వచ్చేశాడు. ఆలీ చేయనన్నాడో.. లేక వివాదం ఎందుకని.. మాటీవీ వాళ్లే తప్పించారో తెలియలేదు. కానీ ఏటేటా అలీ, సుమ కాంబినేషన్ ని చూడ్డం అలవాటు పడ్డవాళ్లకి ఇదో షాకే. మరి అవార్డుల ఫంక్షన్ లో యాంకరింగ్ కాంబినేషన్ అయినా ఉంటుందో లేక దాన్ని కూడా మార్చేస్తారో చూడాలి.