Begin typing your search above and press return to search.

మహేష్ తో పెళ్లి చేయమన్న విలన్ కూతురు

By:  Tupaki Desk   |   30 Aug 2015 9:54 AM GMT
మహేష్ తో పెళ్లి చేయమన్న విలన్ కూతురు
X
టాలీవుడ్ లో హీరోలకున్నంత లైఫ్ టైం హీరోయిన్లకు, విలన్లకు ఉండదు. హీరోయిన్ల లాగే విలన్లు కూడా ఎప్పటికప్పుడు మారిపోతుంటారు. ప్రస్తుతం టాలీవుడ్ విలన్లలో ప్రధానంగా చెప్పుకోవాల్సిన పేరు సంపత్. తమిళంలో విలన్, క్యారెక్టర్ రోల్స్ తో మంచి పేరు సంపాదించుకున్న సంపత్.. మూడేళ్ల కిందట తెలుగులో అరంగేట్రం చేసి.. ఇప్పుడు ఫుల్ బిజీ అయిపోయాడు. మిర్చి, శ్రీమంతుడు లాంటి సినిమాలు సంపత్ కు చాలా మంచి పేరు తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం అరడజనుకు పైగా తెలుగు సినిమాల్లో కీలక పాత్రలు చేస్తున్నాడు సంపత్. తాను ఇప్పటిదాకా తెలుగులో ఏడెనిమిది సినిమాలు చేశానని.. ప్రతి పాత్రా తనకు ప్రత్యేకమని.. ఐతే ‘శ్రీమంతుడు’లో చేసిన శశి పాత్ర ఇంకా ప్రత్యేకమని చెప్పాడు సంపత్.

శ్రీమంతుడు సినిమాలో మహేష్ తో నటించడం మరిచిపోలేని అలాంటి నటుణ్ని తాను చూడలేదని సంపత్ చెప్పాడు. మహేష్ అంటే తన కూతురికి ఎంత అభిమమానమో చెబుతూ.. ‘‘మా అమ్మాయికిప్పుడు పదహారేళ్లు. శ్రీమంతుడు సినిమాను మా అమ్మాయి తమిళంలో చూసింది. బ్యాంకాక్ లో ఉండగా ఫోన్ చేసి.. మహేష్ తనకు బాగా నచ్చాడని.. ఆయనతో పెళ్లి చేస్తావా అని అడిగింది. నాకు నవ్వు ఆగలేదు. సినిమాలో మహేష్ ను కొట్టినందుకు నాపైన కోప్పడిందికూడా. యూ ఆర్ బ్యాడ్ అంది. అది సినిమా అని చెప్పినా.. ‘మహేష్ ని ఎవ్వరూ కొట్టకూడదంతే’ అంది కోపంగా. నాకు తెలిసి మహేష్ కు ఇలాంటి అభిమానులు చాలామంది ఉంటారు. ఆయన అభిమానుల్లో 80 శాతం మంది అమ్మాయిలే అయ్యుండొచ్చు. మహేష్ చాలా ప్రొఫెషనల్ నటుడు. తనతో పోటీగా నటించే వారుంటే చాలా సంతోషిస్తాడు. పర్ఫెక్షన్ కోసం ఎంత టైమైనా ఇస్తాడు, తీసుకుంటాడు. అందువల్లే శ్రీమంతుడు సినిమా బాగా వచ్చింది. శ్రీమంతుడు షూటింగ్ సందర్భంగా అతనేసే పంచ్ లకు పడీ పడీ నవ్వుకునేవాళ్లం’’ అని అన్నాడు సంపత్.