మొత్తానికి మహేష్ బావ సెట్టయ్యాడు

Wed Jun 20 2018 22:44:35 GMT+0530 (IST)

ప్రస్తుతం ఒక్క హిట్టు భగవంతుడా అనే హీరోలు పదుల సంఖ్యలో ఉన్నారు. మొన్నటి వరకు హిట్ అందుకున్న వారు కూడా వరుస డిజాస్టర్స్ తో సతమతమవుతున్నారు. ఒక లెవెల్ లో ఉన్న స్టాండేర్డ్ మార్కెట్ ను సడన్ గా తగ్గించుకుంటే మళ్ళీ దాన్ని సెట్ చేసుకోవడం చాలా కష్టం. అందుకే ఆలస్యం అయినా కూడా కొంత మంది హీరోలు చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తారు.ఇకపోతే ఘట్టమనేని రిలేటివ్ సుధీర్ బాబు గత కొంత కాలం నుంచి హిట్టు కోసం చేయని ప్రయత్నం లేదు. కెరీర్లో ప్రేమ కథ చిత్రం తప్పితే మరో హిట్టు లేదు. దాన్ని వల్ల సుధీర్ బాబుకి ఎలాంటి లాభం రాలేదు. ఆ తరువాత కొన్ని ప్రయోగాలు చేసి నటుడిగా గుర్తింపు వచ్చినా కలెక్షన్స్ పరంగా హీరోకి మార్కెట్ లేదు అనే టాక్ తెచ్చుకున్నాడు. ఇక ఫైనల్ గా సమ్మోహనం సినిమాతో సుధీర్ బాబు హిట్టు కొట్టేశాడు. మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో వచ్చిన సమ్మోహణం ఇటీవల కాలంలో వచ్చిన ది బెస్ట్ సినిమాగా నిలిచింది.

యూఎస్ లో అయితే సుధీర్ బాబు మంచి ప్లేస్ సెట్ చేసుకున్నాడని చెప్పవచ్చు. ఇప్పటికే సమ్మోహనం హాఫ్ మిలియన్ డాలర్లను రాబట్టింది. సోమవారం వరకు 4.3 లక్షల డాలర్లకు అందుకున్న కలెక్షన్స్ మంగళవారం ఆఫర్స్ ఇచ్చి కొంత బ్యాకప్ చేసుకుంది. బయ్యర్ కి సమ్మోహనం నిజంగా మంచి లాభాలను ఇచ్చిందని చెప్పాలి. ఇక ఈ వీక్ పెద్దగా పోటీని ఇచ్చే సినిమాలు కూడా లేకపోవడంతో మరిన్ని లాభాలు కూడా రావచ్చు. అది సంగతి.