Begin typing your search above and press return to search.

సూపర్ స్టార్ ఇంట్లో సమ్మోహనం సెలబ్రేషన్స్

By:  Tupaki Desk   |   19 Jun 2018 10:24 AM GMT
సూపర్ స్టార్ ఇంట్లో సమ్మోహనం సెలబ్రేషన్స్
X
గత వారాంతంలో వచ్చిన ఇంద్రగంటి మోహనకృష్ణ సినిమా ‘సమ్మోహనం’చాలా మంచి టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. చాన్నాళ్ల తర్వాత తెలుగులో వచ్చిన ఒక మెచ్యూర్డ్ లవ్ స్టోరీగా దీన్ని కొనియాడుతున్నారు క్రిటిక్స్. ప్రేక్షకులు కూడా దీన్ని బాగానే ఆదరిస్తున్నారు. తొలి వారాంతంలో మంచి వసూళ్లు తెచ్చుకున్న ఈ చిత్రం.. వీకెండ్ తర్వాత కూడా నిలకడగా సాగుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం సక్సెస్ సెలబ్రేషన్స్ మొదలుపెట్టింది. ఇందుకు సూపర్ స్టార్ కృష్ణ ఇంటిని వేదికగా చేసుకుంది. కృష్ణ అల్లుడు.. ‘సమ్మోహనం’ హీరో సుధీర్ బాబుతో పాటు దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ.. నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్.. ఈ చిత్రంలో కీలక పాత్రతో అదరొట్టిన నరేష్ కలిసి కృష్ణ ఇంట్లో డిన్నర్ చేశారు.

కృష్ణ-విజయనిర్మల కలిసి వారికి విందు ఇచ్చారు. దీనికి సంబంధించిన ఫొటోను సోషల్ మీడియాలో సుధీర్ బాబు షేర్ చేశాడు. సుధీర్.. ఇంద్రగంటి సహా చాలా ఆనందంగా.. ఉత్సాహంగా కనిపిస్తున్నారు ఈ ఫొటోలో. ఈ రోజుల్లో సినిమాలకు పోస్ట్ రిలీజ్ ప్రమోషన్లు కూడా కీలకంగా మారడంతో ‘సమ్మోహనం’ను మరింతగా జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నంలో ఉంది చిత్ర బృందం. వచ్చే రెండు వారాల పాటు చెప్పుకోదగ్గ సినిమాలు కూడా లేకపోవడంతో ఈ అడ్వాంటేజీని ఉపయోగించుకోవాలనుకుంటోంది. ఇప్పటికే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కు దగ్గరగా వచ్చినట్లు చెబుతున్నారు. అమెరికాలో ‘సమ్మోహనం’ హాఫ్ మిలియన్ మార్కు దిశగా సాగుతోంది. అక్కడ సుధీర్ బాబు కెరీర్లోనే ఇది హైయెస్ట్ గ్రాసర్ అయింది. తెలుగు రాష్ట్రాల్లోనూ సుధీర్ బిగ్గెస్ట్ హిట్ ‘ప్రేమ కథా చిత్రమ్’ను ఇది అధిగమించే అవకాశాలున్నాయి.