Begin typing your search above and press return to search.

టీజ‌ర్‌ టాక్ : మాజీ సీఎం భార్య వీర‌విహారం

By:  Tupaki Desk   |   20 Sep 2019 10:32 AM GMT
టీజ‌ర్‌ టాక్ : మాజీ సీఎం భార్య వీర‌విహారం
X
ముఖ క‌వ‌లిక తెలిసిన ఆర్టిస్టుతో భారీ డైలాగులు చెప్పించి.. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అద‌ర‌గొట్టి.. అద్భుత‌మైన లైటింగ్ స్కీమ్ తో సినిమా తీసేస్తే హిట్ట‌వుతుందా? ఏమో.. టీజ‌ర్ - ట్రైల‌ర్ తోనే సినిమా చూపిస్త మావా అంటూ మ‌న ద‌ర్శ‌క‌నిర్మాత‌లు చేస్తున్న ఈ ప్ర‌య‌త్నం చూస్తుంటే ఔరా అనిపించ‌క మాన‌దు. పైగా హార‌ర్ సినిమా అంటేనే లైటింగ్ స్కీమ్ .. రీరికార్డింగ్ స్కీమ్.. వీఎఫ్ ఎక్స్ స్కీమ్ అంటూ ర‌క‌ర‌కాల స్కీమ్ ల‌తో ఖ‌ర్చు త‌డిసి మోపెడు అవుతున్నా ఆ ప్ర‌య‌త్నాల్ని మాత్రం విడిచిపెట్ట‌డం లేదు. మ‌ళ్లీ మ‌ళ్లీ హార‌ర్ థ్రిల్ల‌ర్లు తీస్తూనే ఉన్నారు. భ‌య‌పెట్టి కాసులు కొల్ల‌గొట్టాల‌ని క‌సిగా వ‌స్తున్నారు. అయితే అన్ని ప్ర‌య‌త్నాలు అనుకున్న‌ట్టే ఫ‌లిస్తాయా? అంటే చెప్ప‌లేం.

ఇదిగో `సంహారిణి` పేరుతో అలాంటి ప్ర‌య‌త్న‌మే క‌నిపిస్తోంది. తమిళం- తెలుగు- క‌న్న‌డం- మ‌ల‌యాళం- హిందీ భాష‌ల్లో పాన్ ఇండియా సినిమా అంటూ చెల‌రేగిపోతున్నారు. మాజీ సీఎం కుమార‌స్వామి భార్య రాధిక కుమార స్వామి `అరుంధ‌తి` `భాగ‌మ‌తి` రేంజు లో న‌టిస్తున్న సినిమా అంటూ ప్ర‌చారం ఊద‌ర‌గొట్టేస్తున్నారు. తాజాగా రిలీజైన టీజ‌ర్ చూస్తే ఆ రెండు సినిమాల కాపీలానే ఉంది. కుట్టి ప‌ద్మినిగా పాపుల‌రైన రాధిక కుమార‌స్వామి ఆహార్యం టీజ‌ర్ లో ఆక‌ట్టుకుంది. ఎర్ర రంగు జీర క‌ళ్ల‌తో భ‌య‌పెట్టేందుకు ప్ర‌య‌త్నిస్తోంది. అయితే ఈ టీజ‌ర్ చూడ‌గానే ద‌ర్శ‌కుడు న‌వ‌ర‌స‌న్ ని కోడి రామ‌కృష్ణ ఆవ‌హించాడా? అనిపించ‌క మాన‌దు. అరుంధ‌తి- చంద్ర‌ముఖి- భాగ‌మ‌తి ప్ర‌భావం స‌ద‌రు ద‌ర్శ‌కుడిపై ఉండ‌నే ఉంద‌ని అర్థ‌మ‌వుతోంది. అయితే స‌రిగ్గా అరుంధ‌తి త‌ర‌హాలోనే ఇందులో ఓ భీక‌ర విల‌న్ ని దించారు. దీంతో సేమ్ టు సేమ్ కాపీ కొడుతున్నారా? అనే సందేహం క‌లుగుతోంది. అయితే కాపీ పేస్టుల కంటే కంటెంట్ లో కొత్త‌గా ఏం చూపిస్తాడు? అన్న‌దే ఇంపార్టెంట్. అది లేక‌పోతే ఈ రోజుల్లో జ‌నం అమెజాన్.. నెట్ ఫ్లిక్స్ ల్లో చూడ‌టానికి అల‌వాటు ప‌డిన సంగ‌తిని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది.

అన్న‌ట్టు ఈ టీజ‌ర్ లో కోడి రామ‌కృష్ణ టైపులో పంచ్ డైలాగులు ఉన్నాయండోయ్.. ``ఒసేయ్ ద‌మ‌యంతి నాకు ఎదురు ప‌డితేనే వ‌ద‌ల‌ను.. ఇక ఎదురు తిరిగితేనే వ‌దులుతానా? అంటూ విల‌న్ ప‌శుప‌తిలా ఘీంకరించాడు. దానికి ప్ర‌తిగా ద‌మ‌యంతి అలియాస్ సంహారిణి డైలాగ్ అదిరిపోయింది. ``అన్యాయానికి అనుస‌రించి పోవ‌డానికి న‌ల‌చ‌రిత్ర‌లో వ‌చ్చే న‌ల‌ద‌మ‌యంతిని కాదురా.. శ‌త్రువుల గుండెను చీల్చి మృ్యువుతో రుద్ర‌వ‌తాండ‌వ‌మాడే ద‌మ‌ద‌మ‌ద‌మ‌యంతిని రా నేను అలాంటి న‌న్నే దిగ్భందించే దిమాక్ వ‌చ్చిందిరా మీకు?`` అంటూ కుట్టి ప‌ద్మిని భీక‌ర‌మైన ఎక్స్ ప్రెష‌న్ ఇచ్చింది. క‌న్న‌డ - త‌మిళంలో ప‌లు విజ‌య‌వంత‌మైన చిత్రాల్లో న‌టించిన ప‌ద్మిని అలియాస్ రాధిక వ‌న్ ఫైన్ డే క‌ర్నాట‌క సీఎం కుమార స్వామిని ర‌హ‌స్యంగా పెళ్లాడ‌డం అప్ప‌ట్లో సంచ‌ల‌న‌మైన సంగ‌తి తెలిసిందే. పెళ్లి త‌ర్వాత నిర్మాత‌గా సెటిలై ఇప్పుడు మ‌ళ్లీ ముఖానికి మేక‌ప్ వేసుకుంటున్నారు. అందులో భాగంగానే ఈ భారీ చిత్రంలో న‌టిస్తున్నార‌ట‌. శ్రీ ల‌క్ష్మి వృషాద్రి ప్రొడ‌క్ష‌న్స్ స‌మ‌ర్ప‌ణ‌లో జీఈ గీతా ఎంట‌ర్‌ టైన్‌ మెంట్స్ నిర్మిస్తోంది.