ఎన్నాళ్లకో జైచిరంజీవ బ్యూటీ దర్శనం!

Wed May 23 2018 23:05:22 GMT+0530 (IST)

టాలీవుడ్ లో ఒకప్పుడు బాగా హల్ చల్ చేసిన బ్యూటీ సమీరా రెడ్డి. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి ఇంపోర్ట్ అయిన ఈ బ్యూటీ.. ఇక్కడ వరుసగా పెద్ద స్టార్లతో సినిమాలు చేసింది. ఎన్టీఆర్ తో నరసింహుడు..అశోక్ వంటి చిత్రాలతో పాటు మెగాస్టార్ చిరంజీవి సరసన జై చిరంజీవ చిత్రంలో కూడా యాక్ట్ చేసింది.ఆ తర్వాత కూడా కొన్నాళ్లు కెరీర్ కంటిన్యూ చేసిన 2014లో పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయింది. అక్కడి నుంచి తన లైఫ్ ను పూర్తిగా కుటుంబానికే కేటాయించిన ఈమె.. ఆ మురసటి ఏడాదే తల్లయింది కూడా. అక్షయ్ వార్దే అనే వ్యక్తిని పెళ్లాడిన ఈమెకు.. ఓ పండంటి బాబు కూడా ఉన్నాడు. రేపు ఆ చిన్నారికి 2 సంవత్సరాల వయసు పూర్తి చేసుకుని.. మూడో ఏడాదిలోకి అఢుగు పెడుతున్నాడు. 'నీతో గడిపిన మొదటి రోజు ఇది. రేపు నువ్వు 3 ఏళ్ల వయసులోకి వస్తున్నాయి. నా జీవితంలోకి వచ్చినందుకు నీకు కృతజ్ఞతలు' అంటూ తన కొడుకుతోపాటు తాను ఉన్న ఫోటోను పోస్ట్ చేసింది సమీరా రెడ్డి.

పెళ్లి తర్వాత తన లైఫ్ లో చాలానే మార్పులు వచ్చినట్లు చెప్పిన సమీరా.. సినిమాలకు గుడ్ బై చెప్పినా.. ఇండస్ట్రీతో మాత్రం టచ్ లోనే ఉంటోంది. రీసెంట్ గా సోనాలి బింద్రే- సమీరా రెడ్డి భేటీ కావడంపై కొన్ని చర్చలు జరిగాయి. మళ్లీ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడంపై సమీరా రెడ్డి సమాలోచనలు జరుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి కానీ.. కొడుకుతో ఈమె ఫోటోను చూస్తుంటే మాత్రం.. ఆ ఉద్దేశ్యాలు ఉన్నట్లుగా కనిపించడం లేదు.