Begin typing your search above and press return to search.

ఆమెతోనే చిరు సర్దుబాటు

By:  Tupaki Desk   |   12 Dec 2018 11:16 AM GMT
ఆమెతోనే చిరు సర్దుబాటు
X
చిరంజీవి ‘ఖైదీ నెంబర్‌ 150’ చిత్రం కోసం ఎంతో మంది హీరోయిన్స్‌ ను పరిశీలించి చివరకు కాజల్‌ ను ఓకే చేశారు. ఆ చిత్రంలో కాజల్‌ పాత్ర కాస్త తక్కువగా ఉంది కనుక ఆమె సెట్‌ అయినట్లుగానే అనిపించింది. ఆరు పదుల వయస్సు దాటిన చిరంజీవి కి జోడీ గా హీరోయిన్స్‌ ను సెట్‌ చేయాలంటే దర్శకులకు పెద్ద ఇబ్బందిగా మారుతోంది. ఎంతో మంది స్టార్‌ హీరోయిన్స్‌ ఆయన పక్కన నటించేందుకు సిద్దంగా ఉన్నా, ఆయన వయస్సు రీత్యా సెట్‌ అయ్యే పరిస్థితి లేదు. సీనియర్‌ హీరోయిన్స్‌ ను పెడితే క్రేజ్‌ దెబ్బతినే అవకాశం ఉంది. అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో చిరంజీవి హీరోయిన్‌ విషయంలో సర్దుబాటు చేసుకోవాల్సిన పరిస్థితి వస్తోంది.

ప్రస్తుతం ‘సైరా’ చిత్రంలో చిరంజీవికి జోడీగా నయనతార నటిస్తున్న విషయం తెల్సిందే. రామ్‌ చరణ్‌ ఆమె కు భారీ పారితోషికం ముట్ట జెప్పి డేట్లు తీసుకున్నాడు. ఆ డేట్లనే చిరు తర్వాత సినిమా కొరటాల దర్శకత్వంలో తెరకెక్కబోతున్న సినిమాకు వినియోగించే అవకాశాలున్నాయంటూ సమాచారం అందుతోంది. ఆడే కాల్షీట్లను ఇంకాస్త పెంచి, మరింత పారితోషికం ఆమెకు ఆఫర్‌ చేయనున్నట్లుగా చెబుతున్నారు. మరో హీరోయిన్‌ కంటే చిరంజీవి కి జోడీ గా సీనియర్‌ హీరోయిన్‌ అయిన నయనతార అయితేనే బెటర్‌ అంటూ కొరటాల శివ కడా ఒక అభిప్రాయంకు వచ్చినట్లుగా సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

ఈమద్య కాలంలో స్టార్‌ హీరోలు కాని, చిన్న హీరోలు కాని ఎవరు కూడా ఒకేసారి రెండు సినిమాల్లో ఒకే హీరోయిన్‌ తో లేదంటే బ్యాక్‌ టు బ్యాక్‌ ఒకే హీరోయిన్‌ తో సినిమాలు చేసిన, చేస్తున్న దాఖలాలు లేవు. కాని చిరంజీవి మాత్రం తన ఏజ్‌ కు తగ్గ హీరోయిన్స్‌ దొరికే పరిస్థితి లేకపోవడంతో తప్పని సరి పరిస్థితుల్లో మళ్లీ ఆమెతోనే సర్దుకు పోబోతున్నాడు. సైరా మరియు కొరటాల మూవీలు సమాంతరంగా చిత్రీకరణ జరుపనున్నారు. రెండు సినిమాలు కూడా కాస్త అటు ఇటుగా రెండు మూడు నెలల గ్యాప్‌ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.