Begin typing your search above and press return to search.

ఫేస్ బుక్ లైవ్ లో .. శమంతకమణి పైరసీ..

By:  Tupaki Desk   |   20 July 2017 5:30 PM GMT
ఫేస్ బుక్ లైవ్ లో .. శమంతకమణి పైరసీ..
X

సోషల్ మీడియాతో ఎప్పటికప్పుడు తెగ అప్డేటెడ్ గా ఉండే అవకాశం జనాలకు చిక్కింది. టెక్నాలజీ ప్రియులకైతే ఇదో చక్కటి సాధనంగా మారిపోయింది. అయితే.. ఒక టెక్నాలజీతో మంచి ఎంత.. చెడు ఎంత అంటే.. ఇతమిత్థంగా ఇంత అని లెక్కేసి చెప్పడం కష్టమే కానీ.. చెడు పాళ్లు ఎక్కువగా ఉంటాయని అనడంలో సందేహం అక్కరలేదు.

ఇప్పుడు ఓ కుర్ర హీరోకు ఏకంగా ఫేస్ బుక్ పై విరక్తి వచ్చేసేందుకు కూడా ఈ లేటెస్ట్ టెక్నాలజీనే కారణం అవుతోంది. రీసెంట్ గా సందీప్ కిషన్ నటించిన మూవీ శమంతకమణి రిలీజ్ అయింది. టాక్ అటూ ఇటూగా ఉన్నా.. నలుగురు హీరోలు కలిసి నటించిన మూవీ కావడం.. థ్రిల్లర్ జోనర్ పిక్చర్ కావడంతో.. వసూళ్లు బాగానే వస్తున్నాయి. ఇంకా ఈ సినిమా థియేటర్లలో ఆడుతుండగానే.. సందీప్ కిషన్ కి పెద్ద షాక్ తగిలేసింది. శమంతకమణి చిత్రాన్ని ఏకంగా ఫేస్ బుక్ లో లైవ్ లో పెట్టారెవరో. ఇది సందీప్ కళ్లబడింది.

ఇలా కొత్త సినిమాను ఫేస్ బుక్ లో లైవ్ చేయడం కంటే.. దానికి కింద కామెంట్స్ రాస్తున్న జనాలను చూసి ఇంకా మండిపోయింది ఈ యంగ్ హీరోకి. 'అంటే.. ఇప్పుడో ఫేస్ బుక్ పేజ్ లో శమంతక మణి చిత్రం డైరెక్టుగా థియేటర్ నుంచి లైవ్ అవుతోంది. దాన్ని చూస్తూ జనాలు రిప్లైస్..' అంటూ దండాలు పెట్టేసిన సందీప్ కిషన్.. తాను ఇక వదిలేస్తున్నట్లు చెప్పేశాడు. అయితే.. దీనికి హైద్రాబాద్ పోలీసుల నుంచి ఆ లింక్ ఇవ్వండి ప్లీజ్ అంటూ రిప్లై రావడం విశేషం. వారు పైరసీదారులకు బెండు తీసే పనిలో ఉన్నారనమాట.