Begin typing your search above and press return to search.

హిందూ సాంప్రదాయంలో సమంత

By:  Tupaki Desk   |   21 May 2017 7:48 AM GMT
హిందూ సాంప్రదాయంలో సమంత
X
టాలీవుడ్ బ్యూటీ సమంత క్రిస్టియన్ అనే సంగతి తెలిసిందే. ఈ చెన్నై భామ క్రైస్తవ సాంప్రదాయాల మధ్యలోనే పుట్టి పెరిగింది. హిందూ ట్రెడిషన్ గురించి.. వారి సంప్రదాయాల గురించి తనకు ఇసుమంత కూడా ఏమీ తెలియదని గతంలోనే చెప్పింది.

కానీ పెళ్లి అన్నిటినీ మార్చేసింది. ఇప్పటికే అక్కినేని నాగచైతన్యతో నిశ్చితార్ధం కూడా చేసుకున్న సమంత.. ఇప్పుడు హిందూ సాంప్రదాయాలను కొద్దికొద్దిగా అలవాటు చేసుకోవడం నేర్చుకుంటోంది. అందుకే నాగార్జున ఫ్యామిలీలో జరిగే ప్రతీ ఫంక్షన్ కు దాదాపు అటెండ్ అవుతూనే ఉంది. ఇంకా చైతుతో పెళ్లి కాకపోయినా.. అక్కినేని ఇంటి కోడలిగా బాధ్యతల్లో పాలు పంచుకుంటున్న సమంత.. ఇప్పుడు సింగిల్ గానే తిరుమల వెళ్లి వెంకటేశ్వరుని దర్శనం చేసుకోవడం విశేషం. ఇదంతా అచ్చమైన హిందువు అయిన నాగచైతన్యను ప్రేమించడం కారణంగానే అని చెప్పాల్సిన పని లేదు.

తోడుగా చైతు కానీ.. నాగార్జున ఫ్యామిలీలో మరొకరు కానీ.. కనీసం తన ఫ్రెండ్స్ కానీ లేకుండానే సమంత ఒంటరిగా తిరుమల శ్రీవారిి దర్శనం చేసుకుంది. అక్కడ అచ్చమైన హిందూ సాంప్రదాయ వస్త్రధారణలో కనిపించడం మరీ విశేషంగా చెప్పుకోవాలి. టీవీల్లో వచ్చే రామాయణం.. మహాభారతం వంటి కార్యక్రమాలను కూడా ఎప్పుడూ చూడని సమంత.. ఇప్పుడు అసలు సిసలైన హిందువుగా మారిపోవడం అంతా.. ప్రేమ కథ ఆమె జీవితంలో తెచ్చిన మార్పే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/