Begin typing your search above and press return to search.

స్టూడియోలో 'సిన్న మేడం' సందడి??

By:  Tupaki Desk   |   29 Sep 2016 5:30 PM GMT
స్టూడియోలో సిన్న మేడం సందడి??
X
టాలీవుడ్ లో బాబూ అనిపించుకునే వారసులు బోలెడు మంది ఉంటారు. కానీ ఈ పిలుపు నాగార్జునతో మొదలైంది అంటారు సినీ జనాలు. అక్కినేని స్టూడియోస్ లో 'చినబాబు' అనే పిలుపుతో ఈ సందడి మొదలు కాగా.. ఆ తర్వాత అదే టైటిల్ తో నాగ్ ఓ సినిమా కూడా చేసేశాడు. ఆ తర్వాత ఈ బాబుల కల్చర్ ఇండస్ట్రీ అంతా పాకిపోయింది. ఆ తర్వాత పీక్స్ వెళ్లిపోగా.. ఇప్పుడు లేటెస్ట్ జనరేషన్ హీరోలు వచ్చాక.. బాబుల హంగామా కాస్త తగ్గిందనే చెప్పాలి. అయితే.. అదే అన్నపూర్ణ స్టూడియోస్ ఇప్పుడు చిన్న మేడమ్ అడుగులకు మడుగులు ఒత్తే పనిలో పడిపోయిందట.

అక్కినేని నాగ చైతన్యతో సమంత పెళ్లి దాదాపు ఖాయమైపోయిందనే విషయాన్ని చెప్పేసుకోవచ్చు. అందుకే స్టూడియోలో ఇప్పటికే ఈమెకు మేడమ్ హోదా ఇచ్చేసి.. చిన్న మేడమ్ అని ఫిక్స్ అయిపోయారట. మరికొన్నాళ్లలో అన్నపూర్ణ స్టూడియోస్ ఒక వింగ్ ని సమంత హ్యాండిల్ చేయబోతోందనే టాక్ కూడా గట్టిగానే వినిపిస్తోంది.

రాబోయే కాలంలో సినిమా నిర్మాణంలో కూడా బాగా యాక్టివ్ అయ్యే ఆలోచన నాగచైతన్యకు ఉందని టాక్. ఇప్పటికే తండ్రి నుంచి వారసత్వం అంది పుచ్చుకున్న ఈ రొమాంటిక్ హీరో.. ప్రొడక్షన్ లో కూడా ట్యాలెంట్ చూపించనుండగా.. సమంత సాయం చేయడం ఖాయమైందట. అందుకే అన్నపూర్ణ స్టూడియోలే ఈవిడ చిన్న మేడం అయిపోయిందని టాక్.