Begin typing your search above and press return to search.

సమంత తిప్పలు పడుతోందా?

By:  Tupaki Desk   |   28 April 2016 5:30 PM GMT
సమంత తిప్పలు పడుతోందా?
X
సౌత్ బ్యూటీ సమంత ఇప్పుడు టాప్ లీగ్ లో కంటిన్యూ అవుతోంది కానీ.. ఈ భామ పాపులారిటీ విషయంలో మాత్రం చాలానే తేడాలొచ్చేసిన మాట వాస్తవమే. గతంలో అయితే సమంత ఉంటే సినిమా హిట్టు గ్యారంటీ అనే క్రేజ్.. ఈమెకు బోలెడు డిమాండ్ తెచ్చిపెట్టింది. కానీ ఇప్పుడంత సీన్ కనిపించడం లేదు. మరో నెల రోజుల వ్యవధిలో.. సమంత మూడు భారీ సినిమాలను రిలీజ్ చేయనుంది.

సూర్యకి జంటగా విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో చేసిన 24 - నితిన్ కి జోడీగా త్రివిక్రమ్ దర్శకత్వంలో అ..ఆ.. లతో పాటు టాలీవుడ్ సూపర్ స్టార్ సరసన ముగ్గురు హీరోయిన్లలో ఒకరిగా నటిస్తున్న బ్రహ్మోత్సవం చిత్రాలు మే నెలలో విడుదల కానున్నాయి. ఇంత క్రేజీ ప్రాజెక్టులు చేతిలో ఉన్నా.. శామ్స్ పరిస్థితి కొంత గందరగోళంలోనే ఉందనే మాట వాస్తవమే. అందుకే ఎప్పటికప్పుడు తనను ప్రమోట్ చేసుకునేందుకు ట్రై చేస్తోంది.

సౌతిండియాలో 100 కోట్ల షేర్ సాధించిన ఇద్దరు హీరోయిన్లలో తానొకరు అంటూ.. రీసెంట్ గా ఓ ట్వీట్ ను రీట్వీట్ చేసింది సమంత. అలాగే యూఎస్ లో 7 మిలియన్ డాలర్ల వసూళ్లు సాధించిన హీరోయిన్ అనే ఓ ప్రచారం కూడా తన పీఆర్ టీంతో చేయిస్తోంది. మరోవైపు సోషల్ మీడియాలో తన బర్త్ డే అయిన 28 ఏప్రిల్ నాడు సమంత హ్యాష్ ట్యాగ్ కు ప్రచారం లభించేలా ప్లాన్ చేసింది.

మరోవైపు తమిళ క్రిటిక్స్ ఈమె ట్యాలెంట్ ను - రీసెంట్ సినిమాల్లో యాక్టింగ్ ను తెగ విమర్శించేస్తున్నారు. అయితే తను సినిమాలో ఉంటే అదృష్టం అనే ఫీలింగ్ ని మాత్రం పబ్లిసిటీ చేసుకుంటోంది శామ్స్. ఇవన్నీ తగ్గిపోయిన పాపులారిటీని తిరిగి పొందడంలో భాగంగా పడుతున్న పాట్లే అంటున్నారు సినీ జనాలు.