చైతూ చెప్పింది నా గురించి కాదు -సమంత

Sun May 14 2017 11:37:24 GMT+0530 (IST)

ఒక హీరో ఒక హీరోయిన్ ప్రేమించుకుంటే.. ఆ న్యూస్ పబ్లిక్ అయితే.. వాళ్ళలో ఎవరు ఒంటరిగా కనిపించిన ఆ కనిపించని ఒంటరి పక్షి గురించి ఆరా తీస్తారు. వాళ్ళు  మధ్య ప్రేమ బాగా ఉంటే పరవాలే లేకుంటే ఇంకా అనుమాన ప్రశ్నల వర్షం కురిపిస్తారు. ఆ జంటలో ఒకరు ఎవ్వరు ఎక్కడ ఏమి మాట్లాడినా అది ఖచ్చితంగా వాళ్ళ గురించే ఇలా అన్నారని అనుకుంటూ.. మరో జంట పక్షికి మెలికలు పెడతారు జనాలు.  

ఇప్పుడు స్టార్ హీరోయిన్ సమంతకు కూడా అలాంటి ఇబ్బందే ఏర్పడింది. సమంతకు ట్విటర్ లో ఫాలో అవుతున్న వాళ్ళు ఎక్కువే. కాబట్టి రోజు ఎవరో ఒకరు మంచిగానో చెడుగానో వెటకరంగానో కామెంట్ పెడుతుంటారు. అలానే నాగచైతన్య కొత్త  సినిమా  రారండోయ్ వేడుక చూద్దాం సినిమా ట్రైలర్ శనివారం సాయంత్రం విడుదలైంది. ఇందులో చైతూ ‘అమ్మాయిలు మనశ్శాంతికి హానికరం’ అంటూఒక డైలాగ్ చెపుతాడు. ఇదే పాయింట్ పైన ఓ అభిమాని సమంతను ఒక ప్రశ్న అడిగాడు ట్విటర్లో  “చూడండి మీ కాబోయే భర్త ఎంతటి మాట అన్నాడో అమ్మాయీల గురించి.. దీని గురించి మీరు ఏమంటారు?'' అని ప్రశ్నించాడు. దానికి సమంత కొంచం ఇబ్బంది పడి “నేను ఏంటో చైతుకి బాగా తెలుసు. ఆ మాట మిగతా అమ్మాయిల గురించి” అంటూ చిలిపిగా జవాబు చెప్పింది. 

ప్రేమ బాగా ముదిరి పెళ్లి చేసుకోబోతున్న సమంత చైతూల నిశ్చితార్థం జనవరిలో జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఏడాదిలోనే వీరిద్దరి వివాహ వేడుక జరగబోతుంది.

TAGS: