Begin typing your search above and press return to search.

స‌మంత.. పెద్ద పంచ్ వేసిందిగా..

By:  Tupaki Desk   |   28 Nov 2015 7:30 AM GMT
స‌మంత.. పెద్ద పంచ్ వేసిందిగా..
X
మిల్కీ వైట్ బ్యూటీ త‌మ‌న్నా సెట్స్‌ కి రావాలంటే వెంట మ‌మ్మీ ఉండాల్సిందే. భాటియా ఫ్యామిలీ మ‌హా స్ర్టిక్టు. అందుకే మిల్కీతో పాటే మ‌మ్మీ ఆన్‌ సెట్స్‌ కి వ‌స్తుంటారు. అయితే ఇలా ఉద్యోగం చేసే స్పాట్‌ కి మ‌మ్మీల‌తో రావొచ్చా? అన్న‌ది ఆల్ టైమ్ హాట్ టాపిక్‌. త‌మ‌న్నా బాట‌లోనే పాల‌బుగ్గ‌ల హ‌న్సిక కూడా మమ్మీతో పాటే షూటింగ్ స్పాట్‌ కి వ‌స్తుంది. ఇలా మ‌మ్మీస్ రోజూ ఆన్‌ సెట్స్ వ‌స్తారా అంటే చెప్ప‌లేం.

కానీ మెజారిటీ పార్ట్ మ‌మ్మీలు ఆన్‌ సెట్స్ వ‌చ్చేందుకు ప్ర‌యారిటీ ఇస్తారు. కూతుళ్ల‌పై మ‌మ‌కారం.. జాగ్ర‌త్త కోసం వ‌చ్చి వెళుతుంటారు. అయితే ఇలాంటి వ్య‌వ‌హారాలేవీ నాకు న‌చ్చ‌వ‌ని అంటోంది అందాల స‌మంత‌. ఉద్యోగానికి వెళుతూ ఇలా మ‌మ్మీని - డాడీని వెంట‌పెట్టుకుని ఎవ‌రైనా వెళ‌తారా? నాకు అలాంటివేవీ ఇష్టం ఉండదు. అయినా నా డైరెక్ట‌ర్లంతా మంచి వాళ్లు. అంతా ప్రొఫెష‌న‌ల్‌. సెట్ కొచ్చాక ఖాళీగా గోళ్లు గిల్లుకుంటూ సుత్తి పెట్ట‌రు. త‌మ ప‌ని తాము చేసుకుని పోతుంటారు. నేను కూడా అంతే. ఆన్‌ సెట్స్ వెళితే ఒక‌టే ప‌ని. ప్రొఫెష‌న‌లిజం చాలా ముఖ్యం అని క్లాస్ తీసుకుంది స‌మంత‌. మొన్నటికి మొన్న శృతి హాసన్‌ కూడా సేమ్‌ ఇదే మాట చెప్పింది. అస‌లు స‌మంత దూకుడు చూస్తుంటే మిల్కీకి - హ‌న్సిక‌కి పంచ్ వేసిన‌ట్టు లేదూ?

ప్ర‌స్తుతం ఈ భామ బ్ర‌హ్మోత్స‌వం చిత్రంలో ప్రిన్స్ మ‌హేష్ స‌ర‌స‌న న‌టిస్తోంది. అలాగే త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో అ.. ఆ మూవీలో నితిన్ స‌ర‌స‌న ఆడిపాడుతోంది. కోలీవుడ్‌ లోనూ కొన్ని ప్రాజెక్టులు క్యూలో ఉన్నాయి.