సమంతాకు కొత్త టర్న్!

Fri Aug 10 2018 18:25:35 GMT+0530 (IST)

ఈ ఏడాది మోస్ట్ సక్సెస్ ఫుల్ హీరోయిన్ ఎవరు అంటే అక్కినేని కోడలు సమంతానే. ఇప్పటికే ఒక ఇండస్ట్రీ హిట్ రంగస్థలం ఒక బ్లాక్ బస్టర్ మహానటి ఒక సూపర్ హిట్ డబ్బింగ్ మూవీ అభిమన్యుడు తన ఖాతాలో వేసుకున్న సమంతా ఆయా హీరోల కెరీర్ లో ఇవే బిగ్గెస్ట్ హిట్స్ గా నిలవడం విశేషం. అదే జోష్ తో  తన రానున్న సినిమాల మీద కూడా అభిమానులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. ఇప్పుడు సెప్టెంబర్ లో రానున్న మూవీ యు టర్న్. రెండేళ్ల క్రితం కన్నడలో తక్కువ బడ్జెట్ తో రూపొంది గ్రాండ్ సక్సెస్ అయిన ఈ మూవీ ఆ ఏడాది శాండల్ వుడ్ బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. ఒరిజినల్ వెర్షన్ దర్శకుడు పవన్ తెలుగుకు కూడా బాధ్యతలు తీసుకున్నాడు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా సెప్టెంబర్ రెండో వారంలో విడుదలకు సిద్ధంగా ఉంది. ఇందులో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. సమంత మొదటి సారి హీరోయిన్ ఓరియెంటెడ్ థ్రిల్లర్ మూవీ చేసింది.రంగస్థలంలో సమంతా బావగా నటించిన ఆది పినిశెట్టి ఇందులో పోలీస్ ఆఫీసర్ గా సమంతాకు సహాయ పడే ఒక కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఫ్లై ఓవర్ మీద ఉండే ఒక డివైడర్ మధ్యలో పడగొట్టిన గ్యాప్ లో రాంగ్ టర్న్ తీసుకునే వాహనాల వల్ల వచ్చే ప్రమాదాన్ని ఇంటరెస్టింగ్ కాన్సెప్ట్ తో రాసుకున్న పవన్ ఊహకందని కథనంతో నడిపించిన తీరు ప్రేక్షకులను బాగా థ్రిల్ చేసింది. అందుకే సమంతా ఏరికోరి మరీ ఇది చేయడానికి ఒప్పుకుంది. ఇందులో డ్యూయెట్లు ఉండవు. లవ్ ట్రాక్ కనిపించదు. ఆద్యంతం ఇన్వెస్టిగేషన్ తరహాలో మంచి టెంపోతో సాగుతుంది. స్టార్ అట్రాక్షన్ ఉంది కాబట్టి సహజంగానే యుటర్న్ కు మంచి హైప్ వచ్చేస్తుంది. ఇప్పటికే వదిలిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ ఆసక్తి రేపగా త్వరలో టీజర్ విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మరి యుటర్న్ సమంతాతో పాటు బాక్స్ ఆఫీస్ కు కూడా బ్రేక్ ఇస్తుందేమో చూడాలి.