Begin typing your search above and press return to search.

కాజల్ ఐటెం గురించి నేనేం చెప్తాను?

By:  Tupaki Desk   |   30 Aug 2016 11:30 AM GMT
కాజల్ ఐటెం గురించి నేనేం చెప్తాను?
X
గతంలో 'బృందావనం' సినిమాలో కాజల్ మెయిన్ హీరోయిన్ అయితే.. అప్పుడే వచ్చిన కొత్తపిల్ల సమంత. అప్పుడు సీన్ వేరు. కాని ఇప్పుడు ఈమె కాజల్ కంటే పెద్ద స్టార్ అయిపోయింది. ఫ్యాషన్ నుండి హాట్నెస్ వరకు.. అన్నింటిలోనూ టాపర్ సమంత. అందుకే ఇప్పుడు సమంత మెయిన్ హీరోయిన్ గా చేసిన ''జనతా గ్యారేజ్‌'' అండ్ మొన్నామధ్యన ''బ్రహ్మోత్సవం'' సినిమాల్లో కాజల్ చిన్న పాత్రలు చేయాల్సి వస్తోంది.

అయితే జనతా గ్యారేజ్ సినిమాలో ఇతర హీరోయిన్లతో వర్కింగ్ ఎక్సపీరియన్స్ గురించి చెప్పమంటే.. నిత్యా మీనన్ గురించి బాగానే చెప్పింది సమంత. ''నేను తనతో కలసి చేస్తున్న ఫిఫ్త్ టైమ్ కాంబినేషన్ ఇది. ''ఇప్పటికి నాలుగుసార్లు మేమిద్దరం ఒకటే సినిమాలో కనిపించాం. ఇప్పుడు జనతా గ్యారేజ్ 5వ సినిమా. ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది. నిత్యా చాలా సూపర్బ్ గాళ్‌'' అని చెప్పింది. కాని కాజల్ గురించి అడిగితే మాత్రం.. ''ఆమె చేసింది ఒక ఐటెం సాంగ్. అందులో నాకేం పనుంటుంది? ఆ సాంగ్ గురించి నేనేం చెప్తాను?'' అంటూ విసుక్కుందిలే.

గతంలో ఇదే పాట గురించి మాట్లాడిన కాజల్.. ''నేను చేస్తోంది ఐటెం సాంగ్ కాదు. ఇదొక స్పెషల్ ఎప్పీరియన్స్. ఇక మీదట ఇలాంటి పాటలు చేస్తానని అనుకోవద్దు. చేతినిండి ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాను'' అని చెప్పింది. ఒక ప్రక్కన కాజల్ అలా 'స్పెషల్ ఎప్పీరియన్స్' అంటూ కవరింగ్ ఇచ్చుకుంటుంటే.. సమంత మాత్రం స్ర్టయిట్ గా అదో ఐటెం నెంబర్ అంటూ పంచ్ వేసి.. ఫ్యాన్స్ కు మతిపోగొట్టింది.